NRI News: లండన్‍లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి..

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లాఫ్‌బరో విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి జిఎస్ భాటియా మృతి చెందాడు. డిసెంబర్ 15న తూర్పు లండన్ లో అదృశ్యమైన అతను సరస్సులో శవమై తేలాడు. తూర్పు లండన్ లో ని ఓ సరస్సు నుంచి భాటియా మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. అయితే భాటియా ఎలా చనిపోయాడు అనే దానిపై స్పష్టత రాలేదు. ఘటనకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలని కోరారు.

గురాష్మన్ సింగ్ భాటీయా డిసెంబర్ 15న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై భారతీయ జనతా పార్టీకి చెందిన మంజీందర్ సింగ్ సిర్సా కూడా మాట్లాడారు. ఈ విషయాన్ని సిర్సా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. భాటియా చివరిసారిగా డిసెంబర్ 15న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో కనిపించాడని సిర్సా చెప్పారు. భాటియా ఏమయ్యోడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని లాఫ్‌బరో విశ్వవిద్యాలయం, భారత హైకమిషన్‌ను కూడా కోరాడు.

An Indian student who went missing in London has died

"లాఫ్‌బరో యూనివర్సిటీకి చెందిన విద్యార్థి GS భాటియా డిసెంబర్ 15 నుండి కనిపించకుండా పోయారు. చివరిగా ఈస్ట్ లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో కనిపించారు. @DrSJaishankar Ji దయతో అతనిని గుర్తించే ప్రయత్నాలలో పాల్గొనవలసిందిగా @lborouniversity & @HCI_Londonని మేము కోరుతున్నాము. మీ సహాయం చాలా ముఖ్యం. దయచేసి షేర్ చేయండి " అని సిర్సా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు భాటియా కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని సరస్సుల్లో కూడా వెతకగా గురువారం ఓ మృత దేహం లభించింది. చివరకు అది భాటియాది అని పోలీసుల కనుగొన్నారు. ఈ నెల ప్రారంభంలో నవంబర్‌లో UKలో అదృశ్యమైన 23-భారత విద్యార్థి మిత్‌కుమార్ పటేల్ లండన్‌లోని థేమ్స్ నదిలో శవమై కనిపించాడు. మిత్‌కుమార్ పటేల్ సెప్టెంబరులో ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. నవంబర్ 17న కనిపించకుండా పోయాడు. మెట్రోపాలిటన్ పోలీసులు నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. అతను పారామెడిక్స్ చేత చనిపోయినట్లు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+