మిత్రులు చూస్తుండగా: అమెరికాలో ఆంధ్ర టెక్కీ మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలోని ఓ నదిలో నదీ స్నానం చేస్తూ మృతి చెందాడు. శివదేవుని చిక్కాల గ్రామానికి చెందిన నిమ్మల రామారావు కుమారుడు నిమ్మల జయశేష రాఘవేంద్రరావు (25) అమెరికాలో మరణించాడు.
ఆయన అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతూ, ఒక ప్రముఖ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు స్నేహితులతో కలిసి నదీ స్నానానికి వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.

స్నేహితుల కళ్లముందే ఈ ఘోరం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే మృతదేహం బయటపడింది. అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా జీవితంలో ఎదుగుతున్న ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడటంతో రామారావు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications