వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలొద్దు: రైతులకు ఆటా సంఘీభావం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఇటీవల కాలంలో భారత్‌లో రైతులు ఆత్మహత్యలకు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యల చేసుకున్న రైతు కుటుంబాలకు మద్దతుగా నిలిచి, తమ వంతు సాయం అందించేందుకు అమెరికా తెలుగు ఆసోషియేషన్ (ఆటా) ముందుకొచ్చింది.

ఇందులో భాగంగా భారత్‌లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలను చర్చల్లో పాల్గొనాల్సిందిగా ఆటా అధ్యక్షులు సుధారక్ పేర్కారి కోరారు. సెప్టెంబర్ 19, శనివారం నాడు అమెరికా వ్యాప్తంగా భారత్‌కు చెందిన రైతు సంస్థలు రైతుల ఆత్మహత్యలకు సంఘీభావం ఈవెంట్స్‌ను నిర్వహించనుంది.

 ATA Conducting Show Solidarity with Farmers events

ఈ ఈవెంట్స్‌లో ఎక్కువ మంది ఎన్నారైలు పాల్గొనాల్సిందిగా సూచించారు. అమెరికాలోని కొన్ని పట్టణాల్లో ఈ ఈవెంట్స్‌ను ఆటా కూడా నిర్వహిస్తుందని, వాటిలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒకవేళ మీరెవరైనా సొంతంగా ఈవెంట్‌ను నిర్వహిస్తుంటే అందరూ రైతులకు మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేయాలన్నారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టి ఫోటోలు, వీడియోల ద్వారా వారికి అండగా మనమున్నామని చాటి చెప్పాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సూచించారు. ఈ ఈవెంట్‌కు స్థానిక భారతీయ మీడియాను కూడా ఆహ్వానించాలన్నారు.

English summary
On Saturday, September 19th, farmers' organizations in India have decided to conduct solidarity events, at the same time everywhere, more people are advised to participate. Some of our friends areorganizing these solidarity events across the U.S.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X