Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆటా డెట్రాయిట్ సంబరాలు: జులైలో సిల్వర్ జూబ్లీ

డెట్రాయిట్: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో 'డెట్రాయిట్ ఆటా డే'ను మిచిగాన్‌లోని తోమా ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఆటాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింభించే విధంగా జూలై 1-3 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, డెట్రాయిట్ కార్యక్రమం ఆటా టస్ట్రీలు హరిప్రసాద రెడ్డి, లింగాల, మురళి బొమ్మనవేణి, రీజినల్ కో-ఆర్డినేటర్ యుగంధర్ భూమిరెడ్డి, ఆటా కాన్సులర్ సర్వీసెస్ చైర్ కాశీ కొత్తా, వెండర్ కమిటీ కో-చైర్ సునీల్ మందుటి ఆధ్వర్యంలో జరిగింది.

1000మందికి పైగా తెలుగు ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షా20వేల డాలర్లకు పైగా రిజిస్ట్రేషన్స్, విరాళాలు ద్వారా అందాయి. మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ ప్రముఖ అతిథిగా హాజరయ్యారు. గాయకులు సందీప్ కూరపాటి, హనిష్క పొలిమెర తమ గీతాలతో అలరించారు. రెనె డ్యాన్స్ అహుతులను అలరించింది.

ఆటా ట్రస్టీలు భువనేశ్ బూజల(డీసీ), అనిల్ బుద్దిరెడ్డి(అట్లాంటా), కన్ఫరెన్స్ టీం లీడ్ చేసినవారు పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి(కన్వీనర్), కె కృష్ణారెడ్డి(డైరెక్టర్), కృష్ణ ముష్యమ్(కో-కన్వీనర్), రమేష్ గారపాటి(కల్చరల్ కో ఆర్డినేటర్), మహిధర్ ముసుకుల(ఆఫీస్ కోఆర్డినేటర్), రాధా కృష్ణారెడ్డి(లోకల్ కోఆర్డినేటర్), రామరాజు అవధూత(సైఆటా చైర్), మల్లా రెడ్డి బొక్క(రిజిస్ట్రేషన్ చైర్, చాందిని దువ్వూరి(సైఆటా కో చైర్), వెంకట్ థుడి(చికాగో ఆర్‌సి) విక్రమ్ రెడ్డి(పొలిటికల్ కో చైర్), సురేష్ పి, నవీన్ మణ్యం(రెజి. కో చైర్), సాయినాథ్, విజయ్ రెడ్డి యనల(యూత్ చైర్)లు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.

ATA DAY Celebrations in DETROIT

చంద్రశేఖర్ రెడ్డి పాల్వాయి, భువనేశ్ బూజల, కెకె రెడ్డి, కృష్ణ ముష్యంలు ఆటా చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. చికాగోలోని రోస్ మోంట్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 1-3వరకు నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ హాజరుకావాలని కోరారు.

కాగా, ఉదయం 8గంటలకే ప్రారంభమైన డెట్రాయిట్ డేలో పాటలు, నృత్యాలు పోటీలు నిర్వహించారు. ఫ్యాషన్ పోటీలు కూడా నిర్వహించారు. సుమారు 200మంది ఈ పోటీ కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు. ఇక్కడ గెలిచిన వారు చికాగోలో నిర్వహించే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు.

కన్వెన్షన్ కల్చరల్ కమిటీ నుంచి రమేష్ గోరపాటి, రామరాజు అవధూతలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు డీకే అరుణ, ప్రణీతలు బహుమతులను ప్రదానం చేశారు. విరాళాలు అందించిన మాధవ్ రెడ్డి, డా. హర్షవర్ధన్ ఆర్ కృష్ణ, డా. హరనాథ్ పులిచర్ల, కాశీ కొత్త, సన్నీరెడ్డి, శ్రీధర్ బండారు, ఆర్ఎస్ఆర్ఐటి(రవి వెల్లం, వెంకట గోనే, శ్రీధర్ కొదాటి)లు ఆటా టీం నుంచి మెమోంటోలు అందుకున్నారు.

సైఆటా(ఎస్ఓఆఆటా), బ్యూటీ పీజెంట్ నిర్వహించిన ఆనంద్ ఆంధ్రా, చెంచు రెడ్డి, జగన్ కొండా, కళ్యాణి మంత్రిప్రగడ, హర్ష అచ్ఛే, కవిత చారబుడ్డి, కవిత కర్లపాటి, కృష్ణ చెల్లెమెల్ల, కృష్ణ ప్రసాద్ జలిగామ, నిఖిత బూజల, నిశిత లింగాల, నీలిమా కటుకూరి, రామ్ దేవులపల్లి, శోభా బూజల, శ్రీనివాస చిట్టలూరి, శ్రీనివాస్ వంగల, శ్రీకాంత్ గాయం, స్వప్న కాల్వ, వేణు, సురపరాజు, కుషల్ జలిగామ(డీజే), జ్యోత్ష్న కంకటాల(యాంకరింగ్), డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్, ట్రోయ్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమానికి సహకరించిన అందరికి ఆటా టీం కృతజ్ఞతలు తెలిపింది.

చికాగో కాన్ఫరెన్స్‌కు అందరూ హాజరుకావాలని కోరింది. మరిన్ని వివరాల కోసం information, please visit www.ataconference.orgని సంప్రదించవచ్చని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+