ఆటా ఆధ్వర్యంలో బౌలింగ్ పోటీలు

ప్రతీ ఒక్కిరికీ రెండు గేమ్స్‌లో ఆడే అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత పాల్గొన్న పోటీదారులందరి సగటులను పరిశీలించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు విజేతలను ఎంపిక చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు జరిగాయి.
టిఏజిసి అధ్యక్షుడు శ్రీనివాస్ పెదమల్లు, ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరంలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమ విజయవంతానికి సహకరించిన సహకరించిన ఆటా, టిఏజిసి సభ్యులు, టిఏజిసి స్పోర్ట్స్ కమిటీ రవి ఉపాద్, ప్రదీప్ కందిమల్ల, వాలంటీర్లు, 2014 టిఏజిసి ప్లాటినం స్పాన్సర్ కృష్ణ రంగరాజు, అశోక్ లక్ష్మణన్, దక్షిత్ ఆనంద్, సురేఖలకు శ్రీనివాస్, కరుణాకర్ మాధవరంలు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications