డర్టీ ఇండియన్ గో బ్యాక్ అంటూ ఆరేళ్ల బాలికపై దాడి.. ఎక్కడంటే ?
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరుగుతున్న ఘటనలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి. ఐర్లాండ్‌లో ఆగస్టు 4న జరిగిన ఓ ఘటన భారతీయ సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. వాటర్‌ఫోర్డ్ నగరంలోని కిల్‌బర్రీ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ కుటుంబానికి చెందిన 6 ఏళ్ల చిన్నారి నియా నవీన్‌పై తోటి పిల్లలు జాత్యహంకార దాడి చేశారు. బాలిక ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దారుణం ఎలా జరిగింది?
నియా తన నివాసం బయట స్నేహితులతో ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారు కొంతమంది అక్కడికి వచ్చారు. అదే సమయంలో నియా తల్లి.. మరో పాపకు చిన్నపిల్లకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. ఆ సమయంలోనే వారు నియా ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. సైకిల్‌తో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచారు.

అంతే కాకుండా "డర్టీ ఇండియన్", "గో బ్యాక్ టు ఇండియా" అంటూ తీవ్ర జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తున్నారు. బాలిక కేకలు విని పరుగెత్తుకొచ్చిన తల్లి, దాడి చేసిన పిల్లలు అక్కడి నుంచి పారిపోతుండడం గమనించింది. తన కూతురు నడవలేని స్థితిలో వణికిపోతూ ఉందని వివరించింది. ఎనిమిదేళ్లుగా ఐర్లాండ్‌లో నర్సుగా పనిచేస్తున్నానని.. ఇటీవలే పౌరసత్వం పొందానని నియా తల్లి అనుపా అచ్యుతన్ తెలిపారు. ఈ ఘటన చిన్నారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వాపోతున్నారు.
దాడులపై పెరుగుతున్న ఆందోళన..
ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు గత కొన్నినెలలుగా ఆందోళనకరంగా పెరిగాయి. జులై నుంచి ఇప్పటివరకు ఐదు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఘటనలపై భారత రాయబారి కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారతీయుల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది. పోలీసులను సంబంధిత ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరింది.













Click it and Unblock the Notifications