ఎన్నారైల బ్యాడ్మింటన్ టోర్నీ
న్యూయార్క్: అమెరికాలోని దక్షిణ బేరింగ్టన్ క్లబ్‌లో తెలుగు అసోసియేషన్ గ్రేటర్ చికాగో (టిఏజిసి), అమెరికన్ తెలుగు అసోయేషన్(ఏటిఏ)లు సంయుక్తంగా రెండో ఏడాది కూడా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో చికాగో పరిసర ప్రాంతంలోని సుమారు 100మంది బాల బాలికలతోపాటు పురుషులు, మహిళలు పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్ టిఏజిసి స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షుడు ప్రదీప్ కందిమిళ్ల, ఉపాధ్యక్షులు కిరణ్ నూతులపాటి, జగన్ బుక్కరాజు, అంజి రెడ్డి కందిమళ్ల, ఆటా ట్రస్టీలు సత్యా కందిమళ్ల, కళ్యాణ్ ఆనందుల, ఆటా ప్రాంతీయ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ మట్ట ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతీ ఒక్కరూ కనీసం రెండు ఆటల్లో పాల్గొన్నారని, ప్రాథమిక రౌండ్లో డబుల్ ఎలిమినేషన్ పద్ధతిని పాటించినట్లు నిర్వాహకులు తెలిపారు. తుది రౌండ్లో బెస్ట్ ఆఫ్ త్రీ పద్ధతిలో నిర్వహించినట్లు తెలిపారు.

టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగినట్లు వారు తెలిపారు. చిన్నారులతోపాటు పురుషులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని చెప్పారు. ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం, టిఏజిసి అధ్యక్షుడు రమేష్ గోరపాటి టోర్నమెంట్ ను నిర్వహించిన స్పోర్ట్స్ కమిటీని అభినందించారు. టోర్నమెంట్ స్పాన్సర్లు యూగేంధర్ గూడూరు, కృష్ణ రంగరాజు, శ్రీని ఒరుగంటి, అనిల్ కోరిపల్లి, టోర్నమెంట్ విజయంతం చేసిన ఇతర వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
టోర్నమెంట్ లో విజేతల వివరాలు
మహిళా విభాగంలో కిరణ్ మట్టే/ కిరణ్ నూతులపట్టి విజేతలుగా నిలవగా లీల అద్దంకి/ కవిత హరికృష్ణ ద్వితీయ స్థానం, ప్రసూన ఓరుగంటి/ పద్మ ముస్కుల తృతీయ స్థానం దక్కించుకున్నారు. బాలికల విభాగంలో అనన్య కనుపరెడ్డి/ ఐశ్వర్య కటికి విజేతలుగా నిలవగా, నిఖితా గారపాటి/ మనీషారెడ్డి ద్వితీయ స్థానం, జ్యోత్స్న హరికృష్ణ/ వంశిఖ రమేష్ తృతీయ స్థానం పొందారు.
బాలుర విభాగంలో సందీప్ అన్నెం/ ప్రీతం దాసిక విజేతలుగా నిలవగా, అనికేత్ దాసిక/ వినీత్ మాధవరం ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో సిబెందు సోమ్/ ఆదర్శ్ నాయర్ తొలిస్థానం పొందగా శ్రీనివాసన్ చిట్టా/ జగన్ రంగన్ ద్వితీయ, వెంకట్ మిలిగిరెడ్డి/ నవీన్ జాగర్లమూడిలు తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications