ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు(పిక్చర్స్)
Recommended Video

డబ్లిన్: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(ఐర్లాండ్ తెలంగాణవాసులు) బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు.

ఉల్లాసంగా, ఉత్సాహంగా..
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 600 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు.

ఆకట్టుకున్న దాండియా
పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైంది.బతుకమ్మ, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సంస్కృతీ.. సంప్రాదాయం
యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి విచ్చేసి బతుకమ్మ పాటలు పాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో ఐర్లాండ్ తెలంగాణవాసులు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు .

ప్రాంతీయ ప్రతినిధుల హాజరు
బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేసారు. ఈ వేడుకలో ఇక్కడి ప్రాంతీయ ఎంపీలు(టీడీఎస్) రుత్ కోపింగర్, జాక్ చాంబర్స్, కౌన్సిలర్ మేరీ మెక్ కేమ్లీ, పాల్గొన్నారు. వచ్చిన అతిథులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు.

అందరి సహకారంతో..
ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు సహకరించిన వారిలో.. శ్రీనివాస కార్పే, సాగర్, ప్రబోధ్ మేకల,జగన్ రెడ్డి మేకల, కమలాకర్ కోలన్, సంతోష్ పల్లె, రవీందర్ రెడ్డి చప్పిడి, రాజేష్ అది, దయాకర్ రెడ్డి కొమురెల్లి, శ్రీనివాస్ పటేల్, సుమంత్ చావా, అల్లే శ్రీను, నగేష్ పొల్లూరు, త్రీశిర్ పెంజర్ల, ప్రదీప్ యల్క, ప్రవీణ్ లాల్, వెచ్చ శ్రీను,వెంకట్ తీరు, సునీల్ పాక, అల్లంపల్లి శ్రీనివాస్, షరీష్ బెల్లంకొండ, శ్రీకాంత్ సంగి రెడ్డి, రమణ యానాల, రామ్ రెడ్డి, వెంకట్ గాజుల, వెంకట్ జూలూరి, వెంకట్ అక్కపల్లి, నవీన్ జనగాం, రాజా రెడ్డి, రామ బొల్లగొని, కొసనం శ్రీను, రాజు తేరా, సాయినాథ్, సుచరిత్ ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications