అక్టోబర్ 22న వాషింగ్టన్ డీసీలో సద్దుల బతుకమ్మ దసరా సంబరాలు: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్

NRI News: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) సద్దుల బతుకమ్మ మరియు దసరా సంబరాలు అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో అక్టోబర్ 22 ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. బ్రాడ్ రన్ హైస్కూల్‌లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మందికి పైగా హాజరు అవుతారని చెప్పారు.

కార్యక్రమానికి హాజరైన వారికి అన్ని ఏర్పాట్లను కార్యనిర్వాహక బృందం చేసింది. భోజనంతో పాటు ఇతరత్రా ఏర్పాట్లను కూడా చేసింది. కార్యక్రమ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు భోజనం ఏర్పాట్లు ఉంటాయి. మధ్యాహ్నం 1 గంటకు సంప్రదాయ వస్త్ర ప్రదర్శన పోటీలు, 1:30 గంటలకు జానపద పాటల పోటీలు,2 గంటలకు బతుకమ్మ ఆటపాట, సాయంత్రం 4 గంటలకు గౌరి/జమ్మి పూజ, 4:30 గంటలకు అలయ్ బలయ్,5 గంటలకు స్థానికులచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, 6 గంటలకు పోతురాజు ధూం ధాం,6:30 ఊరేగింపు కార్యక్రమాలుంటాయి.

Bathukamma and Dasara sambaralu organised by Global telangana Association in washington DC

అంతకుముందు GTA వాషింగ్టన్ డీసీ తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలతో సద్దుల బతుకమ్మ & దసరా సంబరాల టీజర్ మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి వివిధ నగరాల నుంచి సుమారు 500 మందికి పైగా హాజరయ్యారు.అక్టోబర్ 21న శనివారం రోజున తెలంగాణ సంస్కృతిని ఇప్పటి చిన్నారులకు తెలిసేలా, బతుకమ్మ ప్రాముఖ్యతను వారికి వివరించే బతుకమ్మ వర్క్ షాప్ నిర్వహించటం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమానికి వన్ ఇండియా తెలుగు మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

Bathukamma and Dasara sambaralu organised by Global telangana Association in washington DC

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగనే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే సందడిగా కనబడుతుంది.మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

Bathukamma and Dasara sambaralu organised by Global telangana Association in washington DC

ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపి.ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మలతో ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.బతుకమ్మ పండగలో ఆఖరి 9వ రోజు 'సద్దుల బతుకమ్మ'ను ఆరాధిస్తారు. ఆ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా అందంగా వివిధ రంగులతో ముస్తాబుగా పేరుస్తారు.ఆడవారు తమ ఆటపాటలతో 'సద్దుల బతుకమ్మ' పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+