సిడ్నీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు(ఫొటోలు)
సిడ్నీలో బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ది పాండ్స్ పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించిన బతుకమ్మ 2000 మందికిపైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.
సిడ్నీలో బతుకమ్మ సంబరాలు
మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటా-పాటతో, సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో మార్మోగాయి. బతుకమ్మ అచ్చ తెలుగు మాట, తెలంగాణ ప్రజల సాంప్రదాయం శతాబ్ధాల సంస్కృతి తంగేడు పూల సాహిత్యమాల ఆడబడచుల ఆత్మీయ ఆటల కేళి, కొత్త జీవన స్ఫూర్తిని నింపే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు గొప్ప ఊరట. ఇటువంటి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మను సిడ్నీ నగరంలో ప్రవాస తెలంగాణ వాసులు కన్నుల పండుగగా జరుపుకున్నారు.

బతుకమ్మ ఆటపాటలు
వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు. రంగు రంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలతో సందడి చేశారు. తర్వాత బతుకమ్మల చుట్టూ చేరి ఉయ్యాల పాటలు పాడారు.

ఆకట్టుకున్న కార్యక్రమాలు
ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వాటిని తయారు చేసిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక దాండియా షో, జమ్మి పూజ, శివ గర్జన డ్రమ్స్, బతుకమ్మ స్పెషల్ లేజర్ షో, స్పెషల్ ఫోక్ బ్యాండ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
భవిష్యత్ తరాలకు తెలంగాణ సంస్కృతి..
సిడ్నీ బతుకమ్మ దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF) బతుకమ్మ చైర్మన్ అనిల్ మునగాల వందన సమర్పణ చేస్తూ.. ఈ బతుకమ్మ వేడుకలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను , ఆచార వ్యవహారాలను పాటిస్తుండటం ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పడమే సంస్థ ముఖ్య ఉదేశ్యమని తెలిపారు.

సిడ్నీలో బతుకమ్మ వేడుకలు విజయవంతం
ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావటానికి కోశాధికారి- శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్, ప్రజా అధికారి - డేవిడ్ రాజు, కార్య నిర్వాహక కమిటీ సబ్యులు - కవిత టూటుకూరు, కావ్య గుమ్మడవల్లి, వాణి ఏలేట్, శ్వేత యమ, శ్వేత తెడ్ల, హారిక మన్నెం, వత్సల ముద్దం, విద్యా సేరి, లత కడపర్తి చేసిన కృషి కారణమని ఆయన తెలిపారు. సిడ్నీ బతుకమ్మ ఇంత విజయవంతం కావటానికి కారణమైన - స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలంటీర్స్ కు కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications