న్యూజెర్సీలో బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్: న్యూ జెర్సీ తెలంగాణా అసోసియేషన్ నిర్వహించిన ఐదో వార్షిక బతుకమ్మ పండుగ న్యూ జెర్సీలోని న్యూ బ్రున్స్విక్ రట్గర్స్ విశ్వవిద్యాలయం సమీపాన డోనాల్డ్‌సన్ పార్క్ లో ఘనంగా జరిగింది. దాదాపు 500 పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం మహిళలు, పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది.

మధ్యాహ్నం విందు భోజనాలతో మొదలై పిల్లలకు, పెద్దలకు ఆట పోటీలు తరువాత బతుకమ్మ పాటలతో కొనసాగింది. సుమారు 100 పైగా అందంగా ప ర్చి అలంకరించిన బతుకమ్మలు చూపరులను విశేషంగా ఆకర్షించాయి.ఒక్కేసి పువ్వేసి చందమామ, శ్రీ లక్ష్మీ నీ మహిమలూ మొదలగు పాటలతో 2 గంటలు పాటు మహిళలు పిల్లల బతుకమ్మ ఆట ఆడారు.

Bathukamma celebration at New Jersey

కార్యక్రమానికి హాజరైన న్యూజెర్సి అసెంబ్లీమ్యాన్ ఉపేంద్ర చివుకుల, లీడ్ ఇండియాకు చెందిన హరి ఇప్పనపల్లి, ఎడిసన్ మేయర్ కాంటెస్టెంట్ ప్రసాదు ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

పెద్దగా, అందంగా, ఆకర్షణీయంగా పేర్చి న బతుమమ్మలకు బహుమతులతో పాటు, మొదటిసారిగా బతుకమ్మ పాటల పోటీ నిర్వహించగా ముచ్చటగా తెలంగాణా 10 జిల్లా ల నుంచి మహిళలు ముందుకు వచ్చి ఆహ్వానితుల కేరింతలతో పాడి వినిపించారు. చివరిగా బతుకమ్మ లను రేరిటన్ నదిలోలో విడిచి, మలీద ముద్దలు , స్వీట్స్ పంచుకొని కార్యక్రమాన్ని ముగించారు.

ఈ బతుమమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తరువాత మొదటి కార్యక్రంమం కావడంతో ఎంతో ఉత్సాహంతో పాల్గొనడమే కాకుండా, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముందు ముందు మరిన్ని తెలంగాణ సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి న్యూ జెర్సీ నిర్వాహకులు ఆసక్తి కనబరిచారు.

కార్యక్రమ నిర్వాహకులు రవి దన్నపునేని, రమేష్ మాగంటి, నారాయణ స్వామి, శ్రవణ్ నాగపురి , మహేష్ పొగాకు, ప్రదీప్ సువర్ణ, రవి పెద్ది, భాస్కర్ భూపతి, కిశోరే భూపతి, నాగ మహేందర్, గురు అలంపల్లి, హరీష్ అలెన్ని, హేమంత్ ప్రేస్సిగ్న్, శ్రీనివాస్ గానగొని, శ్రీకుమార్, రాంరెడ్డి వేముల తదితరులు స్పాన్సర్స్‌కు, ముఖ్య అతిథులకు, పెద్ద సంఖ్య లో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+