కెనడాలో ఘనంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలు
టొరంటో: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కెనడాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టీడీఎఫ్ కెనడా సాంస్కృతిక విభాగమైన 'తంగేడు' ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో(బ్రామ్జన్) నగరంలోని డేవిడ్ సుజుకీ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

బతుకమ్మ సంబరాలు
కెనడాలో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు తమ కుటుంబాలతో సహా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. 600 మందికిపైగా తెలంగాణ ప్రవాసులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణాలోనే ఉన్నామా అనే భావన కలిగేలా సంబరాలు జరగడం విశేషం. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అందంగా ముస్తాబైన తెలంగాణ మహిళలు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ లయబద్దంగా తిరుగుతూ పాటలు పాడారు. ఆటలు ఆడారు.

సాంస్కృక సంబరం
ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహించారు. ఇక పెద్దవాళ్లు తెలంగాణ సాంస్కృతిలో బతుకమ్మ పండగ గొప్పదనాన్ని పిల్లలకు వివరించారు. ఆ తర్వాత వివిధ రకాల తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతూనే.. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించే కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆటపాటలు..
ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ కెనడాకు చెందిన కార్యవర్గ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ కమిటీ ఛైర్మన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ గార్లపాటి జితేందర్, అధ్యక్షులు పిణీకేశి అమిత రెడ్డి, ఉపాధ్యక్షులు మూల కవిత, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం (టీడీఫ్ కెనడా) క్రీఢా విభాగం అయిన టీడీఫ్ కెనడా స్పోర్ట్స్ క్లబ్భాగస్వామ్యంతో నిర్వహించడం జరిగింది.

ప్రతి ఏడాదిలానే..
టీడీఫ్ కెనడా2005నుంచి ప్రతి సంవత్సరం ఏ విధంగా బతుకమ్మ పండుగను కెనడా లో దిగ్విజయంగానిర్వహిస్తున్నారో దిగువ పేర్కొన్న కోఆర్డినేటర్స్ చాలా శ్రమించి ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిపించారు.పద్మ గంట,శాంత మేడ,ప్రమోద్ధర్మపురి,శ్రీదేవి ధర్మపురి,అతిధి పున్నం,వెంకటరమణరెడ్డి మేడ,పిణీకేశి తిరుపతి రెడ్డి,కీసర మహేందర్ రెడ్డి,ముప్పిడి సుమన్ రెడ్డి, మూలం శ్రీనివాస్ రెడ్డి,కోండం రవీందర్ రెడ్డి,చాడ కృష్ణారెడ్డి,అర్షద్ ఘోరీ,కోండం పవన్ కుమార్,చింతలపని శేషాంక్, ఇతర వాలంటీర్లు పాల్గొని విజయవంతం చేశారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications