డబ్లిన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు(వీడియో)
డబ్లిన్: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(తెలంగాణైటీస్ ఆఫ్ ఐర్లాండ్-టిఓఐ) బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 50మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని నిర్వహించారు.
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా 450మంది హాజరయ్యారు. యువతులు, మహిళలు బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు.
దుర్గామాత పూజతో మొదలైన బతుకమ్మ వేడుకలు, దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియజేయాలనే లక్ష్యంతో (తెలంగాణైటీస్ ఆఫ్ ఐర్లాండ్-టిఓఐ)వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఇండియన్ అంబాసిడర్ రాధిక లాల్ లోకేష్ ఈ వేడుకకు హాజరై అమ్మాయిలతో పాటు బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా అతిథులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు.












Click it and Unblock the Notifications