వాషింగ్టన్‌లో బతుకమ్మ వేడుకలు: పాల్గొన్న కవిత(ఫొటోలు)
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలకు నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

అమెరికాలోని వర్జీనియా డీసీ, మేరీల్యాండ్, డెలావేర్ రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు.

తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖ కార్య నిర్వహణ అధ్యక్షుడు బండారు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సుమంత్, విజన్ తెలంగాణ అసోసియేసన్ అధ్యక్షుడు విజయ్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జగదీశ్ బొందుగుల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications