ఫ్లోరిడాలో బతుకమ్మ వేడుకలు(ఫొటోలు)
ఫ్లోరిడా: తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ఎన్నారై టిఆర్ఎస్(యూఎస్ఏ) నాయకులు మహేష్ తన్నేరు హాజరయ్యారు.
వేదపండితులు పూజలు జరిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ అన్నది జీవ వైవిధ్యాన్నిసూచిస్తుందని, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగ నిలుస్తుందని తెలిపారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలుసుకోవడానికి
తోడ్పడుతుందని, అంతే కాకుండా మహిళా సాధికారతకు కూడా బతుకమ్మ అనేది చిహ్నంగా ఉపయోగపడుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన నేపధ్యంలో తెలంగాణా సంస్కృతిని ఖండాంతరాల్లో కూడా వ్యాప్తి చెందడానికి ప్రయత్నించడం చాలా ప్రశంసనీయమని అన్నారు. అదే విధంగా బంగారు తెలంగాణ సాధించడానికి సలహాలు సూచనలు తెలంగాణ ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. చంద్రశేకర్ గౌడ్ మామిండ్ల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడానికి ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా నాయకులు చందు తాళ్ల, డా. శ్రీనివాస్ దొంతినేని, నరేందర్ కొమ్మ, విక్రం రెడ్డి చందుపట్ల, శ్రీధం వల్లంపట్ల, శ్రీనివాస్ ముతినేని, వెంకట్ కంచర్ల, డా. శ్రీనివాస్ కనుగంటి, డా. అనూప్ రెడ్డి, సుమనా ఐనవోలు, లక్ష్మి చెప్యాల, శ్రీకాంత్ జలగం పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications