ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచ గుర్తింపు లభిస్తోంది. ఐర్లాండ్ దేశంలోను బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డబ్లిన్ నగరంలో తెలంగాణ ఎన్నారైల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. డబ్లిన్ నగరంలో రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు ప్రతి యేటా మాదిరి ఈ ఏడాది అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు.

ఈ వేడుకలకు సుమారు 850 మంది దాకా హాజరయ్యారు. భారతీయత ఉట్టిపడేలా ఎన్నారైలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఈ సందర్భంగా ఆడపడుచులంతా ఆటపాటలతో బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కోలాటం, దాండియా ఆడారు.

మన సంస్కృతి సంప్రదాయాలు ఐర్లాండ్ ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో 11 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నారైలు దయాకర్ రెడ్డి కొమురెల్లి, కమలాకర్ రెడ్డి కొలను, జగన్ మేకల, అల్లే శ్రీనివాస్, సిల్వెని శ్రీను, వెంకట్ జూలూరి, త్రిశీర్, రమణ రెడ్డి, రాజా రెడ్డి, సుమంత్ తెలిపారు . ఈ సందర్భంగా ఐర్లాండ్ తెలంగాణ ఎన్నారై ఫోరమ్ (Telanganites Of Ireland) వ్యవస్థాపకులు ప్రభోద్ రెడ్డి మేకల, సిద్ధం సాగర్‌లను ఘనంగా సత్కరించారు.













Click it and Unblock the Notifications