ఎలుగుబంటి దాడిలో ఎన్నారై యువకుడు మృతి
న్యూయార్క్: ఓ ప్రవాస భారతీయ యువకుడు ఎలుగుబంటి బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎడిసన్‌కు చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి మృతుడు దర్శ్ పటేల్(22) అప్షావా ప్రీసర్వ్ గుండా నడుచుకుంటూ వెస్ట్ మిల్‌ఫోర్డ్ ప్రాంతానికి వెళుతున్నారు.
చిట్టడవిలాంటి ఆ ప్రాంతంలో ఓ సరస్సు కూడా ఉంది. అయితే వారు వెళుతున్న సమయంలో ఓ ఎలుగుంటి ఎదురుకావడంతో భయాందోళనకు గురైన వారందరూ తలోదారిన పరుగులు తీశారు. అయితే ఆ ఎలుగుబంటి వారి వెంటపడింది. నలుగురు మిత్రులు ఎలుగుబంటి నుంచి బయటపడ్డారు. వారందరూ కలుసుకున్న తర్వాత దర్శ్ పటేల్ మిస్సయాడని గుర్తించారు.

వెంటనే అతని సెల్‌ఫోన్‌కు ఫోన్ చేశారు. అతను ఫోన్ ఎత్తకపోవడంతో వెస్ట్ మిల్‌ఫోర్డ్ సెర్చ్ అండ్ రెస్య్కూ యూనిట్‌ను ఆశ్రయించారు. వారు అక్కడ దాదాపు రెండు గంటలపాటు గాలింపు చేపట్టి దర్శ్ పటేల్ మృతదేహాన్ని గుర్తించారు. ఎలుగుబంటి దాడిలో దర్శ్ మృతి చెందాడని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.
అయితే ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎలుగుబంటి లాంటి జంతువులు తిరగవని పర్యావరణ అధికారి ఒకరు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్శ్ మృతిపై విచారణ కొనసాగిస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications