హ్యపీ దీపావళి: కాలిఫోర్నియాలో గల రోస్‌విల్లే‌లో ఘనంగా సెలబ్రేషన్స్..కార్లకు లైట్లు వెలిగించి..

ఏ వేడుక అయినా సరే భారతీయులు సెలబ్రేట్ చేసుకుంటారు. ఖండంతరాలు దాటినా పండగలు/ వాటి విశిష్టతను మరవడం లేదు. కాలిఫోర్నియాలో గల రోస్ విల్లేలో 100 మంది ఇండియన్ అమెరికా కమ్యూనిటీకి చెందిన వారు దీపావళి జరుపుకున్నారు. పండగ సందర్భంగా ఒకరికొకరు విష్ చేసుకున్నారు. తమ ఆప్యాయత, అభిమానాన్ని చాటుకున్నారు.

Bright lights of Diwali shine brightly at Californias Roseville

కరోనా వైరస్ వల్ల పండగలు/ పబ్బలు లేవు. అయితే దీపావళిని మాత్రం రోస్‌విల్లేలో ఘనంగా జరుపుకున్నారు. ఈ నెల 8వ తేదీన 100 మంది ఇండియన్ అమెరికన్ల సాయంత్రం 6 గంటలకు పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సాంప్రదాయ భారతీయ వస్త్రాలు ధరించి.. పిల్ల పాపలతో సరదాగా గడిపారు. తమ కార్లను లైట్లతో వెలిగించారు. ఈ వేడుకలో స్థానిక అమెరికన్లు కూడా పాల్గొనడంతో మరింత శోభ వచ్చింది.

Bright lights of Diwali shine brightly at Californias Roseville

దీపావళి పండుగను హిందువులతోపాటు సిక్కులు, బౌద్దుల కూడా జరుపుకుంటారు. చెడుపై మంచిసాధించిన విజయానికి సంకేతమే దీపావళి. పండగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎల్క్ గ్రోవ్, ఫాల్సామ్, ఒరెంగ్ వెల్, రాంచొ, రాక్‌లీన్, రోస్ విల్లే నుంచి భారతీయ అమెరికన్లు వచ్చారు. చాలా మంది తమ కార్లను ఎల్ఈడీ లైట్లతో సుందరంగా అలంకరించి.. పరేడ్ చేశారు.

Bright lights of Diwali shine brightly at Californias Roseville

పరేడ్ కోసం స్థానిక రిలయన్స్ సూపర్ మార్ట్ స్వీట్లను అందజేయగా.. కమ్యూనిటీ వారికి కృతజ్ఞతలు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+