అమెరికాలో జగన్ ఫ్యాన్స్ వేడుకలు

డెట్రాయిట్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో అమెరికాలోని డెట్రాయిల్‌లో పార్టీ మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. డెట్రాయిట్‌లో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న జగన్ అభిమానులందరూ ఒకే చోటుకు చేరి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

తమ అభిమాన నాయకుడు జగన్ నిర్బంధం నుంచి బయటికి రావడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు జి. శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఎన్నారైలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులతో పార్టీ నేతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Celebrations in Detroit on Jagan’s release

జగన్ విడుదల కావడంతో రాష్ట్రంలో శూన్యత తొలగిపోయిందని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలు జగన్ లాంటి సమర్థ నాయకుడ్ని కోరుకుంటున్నారని వారు తెలిపారు. జగన్ విడుదల కావడంలో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. తమ పార్టీకి, నాయకుడు జగన్‌కు మద్దతుగా నిలిచిన ప్రవాసాంధ్రులకు వారు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను జగన్ చక్కదిద్దగలరని ప్రవాసాంధ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లింగాల హరిప్రసాద్ రెడ్డి, వినోద్ కుకునూరు, రామచంద్రారెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, యుగేంధర్ భూమిరెడ్డి, దేవా, సాగర్ రెడ్డి, వినోద్ ఆత్మకూరు, శివరాం యార్లగడ్డ, శ్రీధర్ తిప్పిరెడ్డి, శ్రీనివాస్ పిఢపర్తి, కొండా‌రెడ్డి, నాగేంద్ర‌రెడ్డి గాలి, రమణారెడ్డి పతేలు, రవికిరణ్, బివి రెడ్డి, కోటి రెడ్డి, విద్యాధర్ రెడ్డి, శేఖర్ పంగరు, జగన్, శ్రీనివాస్ బర్ల, రావు నెరాసు, చెంచు రెడ్డి, వేణు, సాంబిరెడ్డి, విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+