తానా మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం..!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు సర్వం సిద్దమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి తానా సభలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తానా 24వ సభలు జులై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్ లో జరగనున్నాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి డెట్రాయిట్‌లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరాల్లోనూ ఇక్కడే తానా మహాసభలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీకి కొనసాగిస్తూ 2025 మహాసభలను సైతం అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే తాజాగా తానా 24వ సభలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన తానా ప్రతినిధులు ఆయనకు ఆహ్వానపత్రికను అందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో తానా కాన్ఫరెన్స్ ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షుడు కోమటి జయరామ్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర సహా పలువురు ఉన్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తానా కాన్ఫరెన్స్ నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలానే ఈ మహాసభలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఆయనను కలుసుకున్న తానా ప్రతినిధులు సభ వివరాలను తెలియజేసి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ లకు ఆహ్వానం అందజేశారు. ఆ తర్వాత ఎంపీలు పురందేశ్వరి, సీఎం రమేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్ తదితరులను కలిసి ఆహ్వానించారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చే విధంగా ఈ సంబరాలు జరపడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది తరతరాల తెలుగు దనం- తరలివచ్చే యువతరం అనే థీమ్ తో మూడు రోజులపాటు తానా మహాసభలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తానా ప్రతినిధులు వెల్లడించారు.
ముఖ్యమంత్రి @revanth_anumula గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association Of North America) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జులై 3 నుంచి 5 వరకు మిచిగన్ వేదికగా జరిగే 24వ తానా మహాసభలు #24thTANAConference లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం అందించారు.#TANA… pic.twitter.com/PVNwKgN6ue
— Telangana CMO (@TelanganaCMO) March 24, 2025












Click it and Unblock the Notifications