కొలంబస్, డెట్రాయిట్‌లో ఘనంగా బతుకమ్మ(ఫోటోలు)
కొలంబస్ తెలంగాణా అసోసియేషన్ (CTA ) ఆధ్వర్యములో జరిగిన బతుకమ్మ - దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 1200 మంది తెలుగు వారు హాజరయ్యారు. ముఖ్య అతిధులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (తెలంగాణా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్), మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ( తెలంగాణా రాష్ట్ర గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) ఈ కార్యక్రమానికి హాజరైన అతిధులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ విశిష్టతను ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వములో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కరెంటు పథకాలతో పాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివిరించారు. CTA అధ్యక్షుడు రామకృష్ణ కాసర్ల, ఉపాధ్యక్షుడు నవీన్ కనుగంటి ముఖ్య అతిధులను శాలువతో పాటు మెమెంటోలతో సత్కరించారు.

కొలంబస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఈ కార్యక్రమములో బతుకమ్మ ఆట పడుచులతో పాటు, దసరా జమ్మిపూజ, కోలాటం, తెలంగాణా జానపద గీతాలతో ఫ్లాష్ మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. CTA ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడపడుచులు, చిన్నారులకు ట్రోఫీ లను బహుకరించారు.

కొలంబస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఈ కార్యక్రమానికి CTA ప్రెసిడెంట్ రామకృష్ణ కాసర్ల, వైస్ ప్రెసిడెంట్ నవీన్ కనుగంటి, ప్రతినిధులు మహేష్ తన్నీరు, అమర్ రెడ్డి, అశోక్ ఎలందుల, ప్రమోద్ జనగామ, శ్రీనాథ్ పొట్లపల్లి, కృష్ణ కడారి, రమ బిల్లకంటి, లావణ్య
కుసురు, సామ్ ఎద్దు, సజిత్ దేశినేని, వంశీ బేతి, బాల లాభిశెట్టి, వేణు గోపాల్ అహర్నిశలు కృషి చేసి ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడ్డారు.

బతుకమ్మ పాటలతో ప్రతిధ్వనించిన డిట్రాయిట్
డిట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ, తెలంగాణ జాగృతి సహకారం తో నిర్వహించిన 10 వబతుకమ్మ పండుగ ని1500 మంది కి పైగా డిట్రాయిట్ తెలంగాణ వాసులు తమదైన శైలి లో ఎంతో వైభవంగా జరుపుకున్నారు. స్థానిక St. తోమా చర్చి లో కనీవినీ ఎరగని రీతిలో చిన్నా పెద్దలు స్వరాష్ట్రాన్ని తలపించే రకంగా ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకొని, ఈ బతుకమ్మ పండుగని అందరి గుండెల్లో ఓ మధుర స్మృతి గా నిలిచిపోయే రకంగా నిర్వహించారు.

బతుకమ్మ పాటలతో ప్రతిధ్వనించిన డిట్రాయిట్
డిట్రాయిట్ తెలంగాణా కమ్యూనిటీ అధ్యక్షులు రాంగోపాల్ ఉప్పుల స్వాగత ఉపన్యాసం చేస్తూ, తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలని భద్రపరిచే విధంగా గత పదేళ్లుగా తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు.ముఖ్య అతిథి ఎంపీ బల్కా సుమన్ ప్రంసంగిస్తూ తెలంగాణా ఉద్యమంలో ప్రవాస తెలంగాణా సంస్థలు పోషించిన పాత్రని ఎంతో కొనియాడారు . అదే స్ఫూర్తి తో తెలంగాణా అభివృద్ధికి కూడా పాటు పడాలని పిలుపునిచ్చారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications