వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యుపర్టినోలో టి ఆవిర్భావ వేడుకలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: జూన్ 2ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా, తెలంగాణను భారతదేశంలోని 29వ రాష్ట్రంగా అమెరికాలోని క్యుపర్టినో సిటీ మేయర్ గిల్బర్ట్ వాంగ్ అధికారికంగా గుర్తించినట్లు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు విజయ్ చవ్వా తెలిపారు. తెలంగాణను భారతదేశంలో 29వ రాష్ట్రంగా గుర్తిస్తూ.. మేయర్ గిల్బర్ట్ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు చెప్పారు.

ఈ సర్టిఫికేట్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత డిప్యూటీ కాన్సల్ జనరల్ టి. భాస్కరన్, కాన్సల్ ఆనంద్ కుమార్ ఝా, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు విజయ్ చవ్వా, భాస్కర్ మడ్డి, ప్రసాద్ గట్టు, సాయిదీష్ అజ్జన్, రాజు యాసల, చంద్రకళ శ్రీరాందాస్, బాలేశ్వర్ ఇందారపు, జగన్ బెయిరెళ్లి, శ్రీనివాస్ మణికొండ, సురేందర్ పెంచర్ల. భవాపీ శ్రీనివాస్‌లు మేయర్ గిల్బర్ట్ వాంగ్ నుంచి స్వీకరించారు.

క్యుపర్టినో సిటీ హాల్‌లో ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారైలు వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్నారైలు తమ కుటుంబసభ్యులతోపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ గిల్బర్ట్ వాంగ్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారమైందన్నారు. తెలంగాణ ప్రజలు మంచి భవిష్యత్‌ను అందిపుచ్చుకోవాలని అన్నారు. భారతదేశం గొప్ప, దృఢమైన ప్రజాస్వామిక దేశమని కొనియాడారు. భారతదేశ ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నరేంద్ర మోడీ భారత నూతన ప్రధాని కావడాన్ని ఆయన స్వాగతించారు.

భారత కాన్సల్ టి భాస్కరన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కల నెరివేరిందని, ప్రస్తుతం నవ తెలంగాణ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ గుర్తింపు పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపిస్తామని ఆయన చెప్పారు. విజయ్ చవ్వా మాట్లాడుతూ.. టిసిఏ ఆధ్వర్యంలో క్యుపర్టినో నగరంలో కూడా తమ స్వచ్ఛంద కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

టి ఆవిర్భావ వేడుకలు

టి ఆవిర్భావ వేడుకలు

జూన్ 2ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా, తెలంగాణను భారతదేశంలోని 29వ రాష్ట్రంగా అమెరికాలోని క్యుపర్టినో సిటీ మేయర్ గిల్బర్ట్ వాంగ్ అధికారికంగా గుర్తించినట్లు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు విజయ్ చవ్వా తెలిపారు.

టి ఆవిర్భావ వేడుకలు

టి ఆవిర్భావ వేడుకలు

తెలంగాణను భారతదేశంలో 29వ రాష్ట్రంగా గుర్తిస్తూ.. మేయర్ గిల్బర్ట్ సర్టిఫికేట్‌ను జారీ చేసినట్లు చెప్పారు.

టి ఆవిర్భావ వేడుకలు

టి ఆవిర్భావ వేడుకలు

గుర్తింపు సర్టిఫికేట్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత డిప్యూటీ కాన్సల్ జనరల్ టి. భాస్కరన్, కాన్సల్ ఆనంద్ కుమార్ ఝా, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు విజయ్ చవ్వా, భాస్కర్ మడ్డి, ప్రసాద్ గట్టు, సాయిదీష్ అజ్జన్, రాజు యాసల, చంద్రకళ శ్రీరాందాస్, బాలేశ్వర్ ఇందారపు, జగన్ బెయిరెళ్లి, శ్రీనివాస్ మణికొండ, సురేందర్ పెంచర్ల. భవాపీ శ్రీనివాస్‌లు మేయర్ గిల్బర్ట్ వాంగ్ నుంచి స్వీకరించారు.

టి గుర్తింపు పత్రం

టి గుర్తింపు పత్రం

క్యుపర్టినో సిటీ హాల్‌లో ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారైలు వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్నారైలు తమ కుటుంబసభ్యులతోపాటు పాల్గొన్నారు.

టి ఆవిర్భావ వేడుకలు

టి ఆవిర్భావ వేడుకలు

ఈ సందర్భంగా మేయర్ గిల్బర్ట్ వాంగ్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారమైందన్నారు. తెలంగాణ ప్రజలు మంచి భవిష్యత్‌ను అందిపుచ్చుకోవాలని అన్నారు. భారతదేశ ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నరేంద్ర మోడీ భారత నూతన ప్రధాని కావడాన్ని ఆయన స్వాగతించారు.

English summary

 The city of Cupertino, located in San Francisco Bay area or Silicon valley, California, headquarter to the world's highest valued company Apple Inc., on June 2nd recognized Telangana day and also officially recognised the 29th state of India per Vijay Chavva citing Cupertino City Mayor Gilbert Wong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X