పైశాచిక పెద్దనాన్న.. ఏడాది బాలుడి నోట్ల గన్... ఎక్కడో తెలుసా..?

రియాద్ : అదీ అరబ్ రాజ్యం.. అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి. కానీ అలాంటి చోట కూడా ఓ పైశాచిక పెద్దనాన్న సైకోగా ప్రవర్తించాడు. పసివాడి నోట్లు గన్ పెట్టి రాక్షసానందం పొందాడు. ఈ తంతును మరో సైకో వీడియో తీశాడు. చేసింది ఘనకార్యమని సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది వీరి చర్యను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

రియాద్‌కు చెందిన ఓ యువకుడు తన తమ్ముడి కుమారుడిని ఎత్తుకున్నాడు. మొదటి పుట్టినరోజు సందర్భంగా పెద్ద నాన్న ఎత్తుకోవడం సహజమే.. కానీ అతను చేతిలో గన్ పట్టుకొని తీసుకున్నాడు. అప్పటికే తుపాకీతో కాల్చడంతో చిన్నారి గుక్కపట్టి ఏడ్చాడు. ఇంతలో పిల్లాడిని చేతిలోకి తీసుకున్నాడు. ఈ తతంగమంతా మరొకడు వీడియా తీస్తున్నాడు. గన్ ఫౌడర్ చూపించాలని అతనికి సూచించండతో .. పైశాచిక పెద్దనాన్న ఏకంగా తుపాకీనే నోట్లో పెట్టి .. పెద్దగా నవ్వాడు.

daddy‘s brother psycho act...

వీడియోలో తుపాకీ పట్టుకున్న యువకుడి మొహం కనిపించలేదు. తాము చేసిన ఘనకార్యాన్ని మాత్రం వీడియో తీయడమే గాక సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెంటనే ఆ వీడియో కాస్త వైరలైంది. ఆ యువకుడిపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. పసివాడిని భయపెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నావా అని విమర్శించారు. విషయం తెలుసుకొని సౌదీ పోలీసులు రంగంలోకి దిగారు. గన్ పేల్చిన యువకుడిని అరెస్ట్ చేసిన్టు తెలుస్తోంది. సాధారణంగా సౌదీలో ఫంక్షన్లు జరిగితే తుపాకులు పేల్చడం నిషేధం. కానీ ఆయా ఫంక్షన్లలో తుపాకీతో కాలుస్తూనే ఉంటున్నారు. దీంతో కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+