వంశీ-ఆటా అవార్డ్స్ బ్రోచర్ ఆవిష్కరించిన దాసరి(ఫొటో)

న్యూయార్క్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 2014, జులై 3, 4, 5 తేదీల్లో జరుగబోతున్న 13వ ఆటా మహాసభలలో వంశీ-ఆటా అవార్డ్స్ 5వ సారి బహూకరిస్తున్న సందర్భంలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణ రావు దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

ఇప్పటి వరకు అమెరికాలో వివిధ రంగాలలో నిష్ణాతులైన సుమారు 100 మంది తెలుగువారికి వంశీ-ఆటా అవార్డ్స్ బహూకరించడం ప్రశంసించదగ్గ విషయమని దాసరి నారాయణ రావు అన్నారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇంటర్నేషనల్, అమెరికాలోని తెలుగు అసోసియేషన్ (ఆటా)తో కలిసి 2004లో ఏర్పాటు చేసిన సందర్భంగా ‘వంశీ-ఆటా' అవార్డ్స్‌ను మొట్టమొదటిసారిగా చికాగోలో దాసరి నారాయణ రావు ప్రదానం చేశారు.

 Dasari Narayana Rao launches vamsi-ata awards brochure

5వ వంశీ-ఆటా అవార్డు గ్రహీతలు

సంధ్య గవ్వ(టెక్సాస్)కు మహిళా రత్న, దామా వెంకయ్య(న్యూయార్క్)కు సేవా రత్న, డా. చిట్టి మూర్తి(న్యూయార్క్)కి ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఇన్ మెడిసిన్, మూర్తి పి. భావరాజు(న్యూజెర్సీ)కు ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్, ఫ్రొఫెసర్ శ్రీనివాసాచార్య వేదాల(ఒక్లహోమ)కు సాహితీ రత్న, రేవతి మెట్టుకూరు(టెన్నిస్సీ)కు ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఇన్ ప్రమోటింగ్ ఆర్ట్ అండ్ కల్చర్, జయశ్రీ తేలుకుంట్ల(న్యూయార్క్)కు ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఇన్ మీడియా కమ్యూనికేషన్ అవార్డుకు ఎంపికైనట్లు అవార్డ్స్ కమిటీ ఛైర్‌పర్సన్ డాక్టర్ జననీ కృష్ణ తెలియజేశారు.

అంతేకాకుండా ఈసారి నాలుగు సేవా సంస్థలకు కూడా అవార్డులను బహూకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. వాటిలో తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ‘వంగూరి ఫౌండేషన్ అమెరికా' (హూస్టన్), చిన్నారుల అంధత్వ నివారణకు కృషి చేస్తున్న ‘ఐ ఫౌండేషన్ అమెరికా'(వెస్ట్ వర్జీనియా)కు, వికలాంగులకు విశేష సేవలందిస్తున్న ‘హార్ట్ అండ్ హ్యాండ్ ఫర్ ది హ్యాండికాప్‌డ్'(న్యూయార్క్)కు, భారతీయ నృత్య సంగీతాలకు ఎనలేని సేవలందిస్తున్న ‘శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా'(చికాగో)కు బహూకరించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్బంగా వంశీ-ఆటా అవార్డ్స్ ఎంపికకు ఎంతగానో కృషి చేసిన ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం, ఆటా కన్వీనర్ పరమేష్ భీమ్‌రెడ్డి, వంశీ-ఆటా ఛైర్‌పర్సన్ డాక్టర్ జననీ కృష్ణ, వంశీ-ఆటా అవార్డుల 13వ సభల్లో సత్కరిస్తున్నట్లు ‘శిరోమణి' వంశీ రామరాజు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+