డల్లాస్‌లో ‘డాటా’ హోలీ సంబరాలు

న్యూయార్క్: వనభోజనాలు, హోలీ సంబరాలను డల్లాస్ ప్రాంత తెలంగాణ అసోసియేషన్(డాటా) ఆధ్వర్యంలో శనివారం నాడు (మార్చి 22న) టెక్సాల్‌లో ఘనంగా జరిగాయి. వివిధ రకాల రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా సాగిన ఈ సంబరాల్లో 600 మందికి పైగా తెలుగు ప్రజలు పాల్గొన్నారు.
పెద్దలు, పిల్లలు తేడా లేకుండా అందరూ ఈ ఉత్సవాల్లో సందడి చేశారు.

ఉదయం నుంచి సాగిన ఈ వేడుకలు రోజంతా ఉత్సాహంగా సాగాయి. వాలీబాల్ లాంటి పలు క్రీడలు కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోద్ ప్రొద్దుటూరి, శ్రీనివాస్ థిప్పన్న, రామ్ కాసర్ల, హరీశ్ మందాడి, ప్రవీణ్ ఏక్కాటి, మహేందర్ గనపురం, మహేష్ మెరెడ్డి, కిరణ్ చెలమల్ల, రజనీకాంత్ ఎర్రబెల్లి, ఇతర వాలంటీర్లు విజయవంతంగా నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన ఎన్నారైలకు ప్రమోద్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాటాలో సభ్యులుగా చేరాలని ఆయన కోరారు. డాటాలో 80 నూతన కుటుంబాలు సభ్యులుగా చేరాయని ఆయన తెలిపారు. వనభోజనాలు వేడుకల్లో భాగంగా పెద్ద పెద్ద చెట్ల నీడలో వంటకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాకాహార, మాంసాహారలతో కూడిన వివిధ రకాలైన పసందైన(తెలంగాణ చికెన్ కూర, బగారా రైస్, ఆలూ కుర్మ, పచ్చి పులుసు) వంటకాలను సిద్ధం చేశారు.

వంటకాలను ఆరగించిన తర్వాత ఆ తర్వాత హోలీ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల వరకు రంగులు చల్లుకుంటూ పిల్లలు, పెద్దలు ఆనందంగా గడిపారు. తెలుగు పాటలు, ఆటలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారంరికీ డాటా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

DATA holi celebrations in Dallas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+