తానా మహాసభలకు డేట్ ఫిక్స్.. కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 24వ మహాసభలను అమెరికాలోని డెట్రాయిట్‌లో జులై 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలకు.. తానా కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ నాదెళ్ల గంగాధర్, డైరెక్టర్‌ సునీల్‌పాంత్ర, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం ఆహ్వానం అందించారు.

ఈ మరకు ఢిల్లీలో కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ లకు ఆహ్వానం అందజేశారు. ఆ తర్వాత ఎంపీలు పురందేశ్వరి, సీఎం రమేశ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్‌ తదితరులను కలిసి ఆహ్వానించారు.

date-fixed-for-tana-mahasabha-union-ministers-and-mps-invited

మరోవైపు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తానా కాన్ఫరెన్స్‌ నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలానే ఈ మహాసభలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌‌లో ఆయనను కలుసుకున్న తానా ప్రతినిధులు సభ వివరాలను తెలియజేసి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ప్రతి పదేళ్లకు ఒకసారి డెట్రాయిట్‌లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరాల్లోనూ ఇక్కడే తానా మహాసభలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీకి కొనసాగిస్తూ 2025 మహాసభలను సైతం అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ ఏడాది తరతరాల తెలుగు దనం- తరలివచ్చే యువతరం అనే థీమ్ తో మూడు రోజులపాటు తానా మహాసభలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తానా ప్రతినిధులు వెల్లడించారు.

తానా సంఘం వారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చే విధంగా సంబరాలు చేసుకుంటారు. తానా మహాసభలు నిర్వహిస్తూ అమెరికాలోని తెలుగువారిని ఒక్క దగ్గరికి తీసుకొస్తుంటారు. ఈ మహాసభలకు కో ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్, చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్ళను నియమించారు. తానాలో పాతతరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న గంగాధర్ నాదెళ్ళ ఈ మహాసభలను కూడా పర్యవేక్షించనున్నారు. ప్రముఖ నటుడు స్వర్గీయ తమ్మారెడ్డి చలపతి రావు అల్లుడు ఉదయ కుమార్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+