వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్దూలకాయ వ్యాధి: ఎన్నారై లక్ష రూపాయల విరాళం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా మండపేటికి చెందిన సత్యనారాయణ రావు గత కొద్ది రోజులుగా అత్యంత దుర్బరమైన స్దూలకాయం వ్యాధితో బాధ పడుతున్నారు. ఈయన బరువు 237 కిలోలు. ఈయన బాధను తెలుసుకోని కువైట్‌లో ఉంటున్న తెలుగు కళా సమితి ఉపాధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు శుక్రవారం లక్ష రూపాయల విరాళాన్ని చెక్కుగా అందించారు.

ప్రస్తుతం సత్యనారాయణ విజయవాడలోని ఎండో కేర్ హాస్పిటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న సత్యనారాయణను పరామర్శించి, అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్ రవికాంత్ తో మాట్లాడి వివారలు అడిగి తెలుసుకున్నారు.

Donor came forward to save unhealthy farmer

కువైట్ నుండి వేసవి సెలవులకు వచ్చి గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలుకాలోని బొబ్బర్లంకలో ఉంటున్న కుదరవల్లి సుధాకర్ రావు శుక్రవారం ఓ ప్రముఖ న్యూస్ పేపర్‌లో వచ్చిన వార్తా కథనాన్ని చూశారు. దీంతో తెలుగు కళాసమితి (కువైట్) అధ్యక్షుడు రాజుతో ఫోన్ లో మాట్లాడి వెంటనే లక్ష రూపాయల విరాళాన్ని అందచేజేసేలా చేశారు. ఆ తర్వాత విజయవాడలో చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చి అక్కడికి అక్కడే చెక్కు రాసి తన వంతు సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్బంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 26న కువైట్ వెళుతున్నానని అవసరమైతే సత్యనారాయణకు మరింత సహాయం చేసే విషయంలో తెలుగు కళా సమితి అందరితో మాట్లాడాతానన్నారు. కువైట్లో తెలుగు వారికి ఎటువంటి ఆపద, అవసరం వచ్చినా తెలుగు కళా సమితి తన సేవలు అందిస్తుందని అన్నారు. ఇండియన్ ఎంబసీతో ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటామన్నారు.

English summary
One farmer from Mandapeta is suffering with over weight of 237 Kgs and he need 5 lakhs money to undergo immediate operation. He said I have seen this news in TV and immediately I visited the hospital and talked to doctors. helped him IRS 1 lakh for his operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X