దుబాయ్‌లో మురిసిన నటి సుహాసిని (ఫొటోలు)
దుబాయ్: దుబాయ్ తెలుగు వేవ్ రెసోనెన్స్ ఈవెంట్స్ 7 వార్షికోత్సవ వేడుకకకు అతిధిగా రావడం జన్మ జన్మల బంధంగా భావిస్తున్నానని , తన పట్ల ప్రదర్శించిన ఆప్యాయత హృదయాన్ని పులకరింపచేసిందని ప్రముఖ నటి శ్రీమతి సుహాసిని మణిరత్నం ఉద్వేగంగా అన్నారు. శుక్రవారం సాయంత్రం దుబాయ్ లోని ఎమిరేట్స్ హాల్లో జరిగిన వేవ్ రేసోనన్సు ఈవెంట్స్ ఏడవ వార్షికోత్సవ సభకు శ్రీమతి సుహాసిని ముఖ్య అతిధిగా విచ్చేసారు.
శ్రీమతి సుహాసిని పది హిట్ పాటలకు, ఆమె ఆ పాటల్లో ఏ దుస్తులలో కనిపించారో అవే దుస్తులతో పది మంది అభినయించి ఆమెను వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించడంతో ఆమె పులకించిపోయారు . ప్రముఖ వ్యాఖ్యాత "శశి" తన వాక్చాతుర్యంతో కార్యక్రమానికి జవసత్వాలు కలిగించారు. మీ అందరు విశేషంగా పాల్గొని మా రెండు నెలల కష్టానికి ఫలితం అందించారని, భవిష్యత్తులో మేము నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఇలాంటి స్పందనే ఆశిస్తున్నానని వేవ్ రేసోనన్సు ఈవెంట్స్ వ్యస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి గీతా రమేష్ రావెళ్ళ తన ప్రారంభోపన్యాసంలో అన్నారు.
స్పాన్సర్స్ మాకు కొండంత అండ అని వారికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. వేవ్ మూలస్తంభం శ్రీ రావెళ్ళ రమేష్ వేవ్ రేసోనన్సు ఈవెంట్స్ నూతన లోగోను ఆవిష్కరించారు. మాయాబజార్ , శ్రీనివాస కళ్యాణం లాంటి రూపకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పురుష పాత్రలు కూడా స్త్రీలే ధరించి శభాష్ అనిపించుకున్నారు. ఆహ్వానితులపట్ల సభ్యుల చూపిన ఆదరణ అందరిని ఆకట్టుకుంది. ఎమిరేట్స్ హాల్ నాలుగు గంటలపాటు ఆనందడోలికలలో తేలియాడింది అంటే అతిశయోక్తి కాదు. వ్యాఖ్యాత శ్రీమతి సుజాత ముగింపు పలికారు.

దుబాయ్‌లో సుహాసిని
దుబాయ్‌లో వేవ్ రెసొనెన్స్ ఈవెంట్ 7వ వార్షికోత్సవంలో ప్రముఖ సినీ నటి సుహాసిని పాల్గొన్నారు. తన పట్ల చూపిన ఆదరణకు ఆమె మురిసిపోయారు.

హిట్ సాంగ్స్ దుస్తుల్లో...
వివిధ సినిమాల్లోని సుహాసినీ హిట్ పాటల్లోని దుస్తులతో, నృత్యాలతో ఆమెకు స్వాగతం చెప్పారు. ఇది ఆమెను మురిపించింది.

అభినయించి ఆనందపరిచారు
"దంచవే మేనత్త కూతురా " అంటూ ఆ పది మందితో కలిసి అభినయించి అందరిని ఆనందముగ్ధుల్ని చేసారు. "రింగా రింగా " పాట స్వయంగా పాడి అందరి చేత చిందులేయించి ఉత్సాహపరిచారు.

శాస్త్రీయ నృత్యం ఇలా..
కుమారి మోనికా నారాయణన్ తన శాస్త్రీయ నృత్యంతో సభికులను ఆనందపరిచారు. మానసిక వికలాంగుడైన "కార్తీక్" ప్రప్రథమంగా తెలుగులో పాట పాడి అందరిని సంభ్రమాచ్యర్యాలకు గురి చేసారు.

ఏ దేశమేగినా...
ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదంటూ , దుబాయ్ లో ఉన్నా , మరెక్కడున్నా మన సంప్రదాయాలు , మర్యాదలు కాపాడాలని కోరారు .












Click it and Unblock the Notifications