ఈటల నరనరాన స్వార్థమే.. అందుకే బీజేపీలో చేరిక - అనిల్ కూర్మాచలం
ఈటల రాజేందర్‌పై ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ విరుచుకుపడింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని.. ఈటల రాజేందర్ కూడా చేరొచ్చునని.. కానీ అక్కడి నాయకుల మెప్పు కోసం రాజకీయ జీవితమిచ్చిన పార్టీని , కేసీఆర్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం స్పష్టంచేశారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలేసి, కట్టడిలో విఫలమైన సంగతి తెలిసిందే. దీనిని ప్రపంచమంతా విమర్శించిస్తుంటే, ప్రజలు ప్రధానమంత్రి రాజీనామాను కోరుతున్నారని గుర్తుచేశారు. కానీ మీకేమో బీజేపీ గొప్పగా కనబడడమేంటో విచిత్రంగా ఉందన్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం.. వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసం పార్టీలో చేరారని తెలిపారు.

కానీ ఢిల్లీలో ఎంతటి ఆత్మగౌరవం లభించిందో ప్రజలంతా గమినించారని, మంత్రులని, ఎమ్మల్యేలని ఆత్మవిమర్శ చేసుకోమనడం కాదు.. ఢిల్లీ పోయి వచ్చాక ఆలోచించాలని కోరారు. దేశం లో ప్రాంతీయ పార్టీలు పుట్టిందే ఢిల్లీ పార్టీలు వివక్ష చూపిస్తున్నారని.. ఆత్మగౌరవం దక్కడం లేదనే, కానీ ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పార్టీలో చేరడం విడ్డురంగా ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఉద్యమకారులకు అవకాశం రావడం లేదని విమర్శించడం, పదవులు అనుభవించి ఈ రోజు అదే పార్టీ నాశనం కోరుకోవడం మానవత్వం లేని వ్యక్తిత్వానికి నిదర్శనమని ఫైరయ్యారు. వ్యక్తిగతంగా సమస్యలుంటే పార్టీ నాయకత్వంతో చూసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ మాటలని నమ్మే పరిస్థితిలో లేరని, తన స్వార్థం కోసం బీజేపీలో చేరారని, తన ఆస్తులని కాపాడుకోవడం కోసమే ఢిల్లీ పార్టీ అండను కోరుకున్నారని, కానీ ప్రజలు మాత్రం సరైన సందర్భం లో తగిన బుద్ది చెప్తారని తెలిపారు.
కేసీఆర్‌కు హుజురాబాద్ పై ప్రత్యేక ప్రేమ ఉందని, రైతు బంధు పథకాన్ని ప్రారంభించిందే హుజురాబాద్ లోనని, అంతటి గౌరవం హుజురాబాద్ అంటే అని అనిల్ తెలిపారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications