ఆస్ట్రేలియాలో ఎన్నారై అదృశ్యం: సాయం కోసం విజ్ఞప్తి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో డెలీవరి వ్యాన్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ భారతీయుడు అదృశ్యమయ్యాడు. మూడు నెలల క్రితం అదృశ్యమైనా అతని ఆచూకీ దొరకకపోవడంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. బాధిత కుటుంబసభ్యులు తమకు సహాయం చేయాలని కోరుతున్నారు.
శివ చౌహాన్(27) తన విధుల్లో భాగంగా మే 1న డెలివరీ వ్యాన్‌ను తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాతి రోజు మెల్బోర్న్ శివారు ప్రాంతమైన కీస్బోరాలో లాక్ వేసిన అతని వాహనం కనిపించింది. దీంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శివ చౌహాన్ ఫొటోను విడుదల చేశారు. అతడు హత్యకేమైనా గురయ్యాడా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా, శివ సోదరుడు దినేష్ చౌహాన్ ఎస్బిఎస్ పంజాబీ రేడియోలో తమకు సాయం చేయాలని బహిరంగ విజ్ఞప్తి చేశాడు.
‘నేను నా సోదరుడ్ని కలవాలని ఎన్నో ఆశలతో ఇండియా నుంచి ఆస్ట్రేలియా వచ్చాను. అతని ఆచూకీ గురించి ఇప్పటివరకు ఏ చిన్న క్లూ కూడా పోలీసులకు తెలియలేదు' అని దినేష్ పేర్కొన్నాడు. తన సోదరుడి ఆచూకీ తెలియకపోవడంతో తాను మెల్బోర్న్ నుంచి ఖాళీ చేతులతో వెళ్లాల్సి వస్తోందని వాపోయాడు. శివ స్నేహితులు కూడా అతని ఆచూకీ తెలిపిన వారికి 20,000 ఆస్ట్రేలియన్ డాలర్లను చెల్లిస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications