తొలిసారి టిసిఏ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు(పిక్చర్స్)

సన్నీవేల్: అమెరికాలోని సిలీవ్యాన్ బే ఏరియాలో రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకుని తొలిసారి 'దవాత్ ఈ-ఇఫ్తార్'కార్యక్రమాన్ని జూన్ 29న ఘనంగా నిర్వహించారు. సన్నీవేల్ ప్రాంతంలోని బిర్యానీజ్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 500మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు.

తెలంగాణ కల్చరల్ అసోసియేషన్(టిసిఏ), బిర్యానీజ్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తాము చేపట్టిన తొలి ఇఫ్తార్ విందు కార్యక్రామానికి టిసిఏ ఫౌండింగ్ ఛైర్మన్ విజయ్ ఛావా, టిసిఏ ఛైర్మన్ భాస్కర్, టిసిఏ ప్రెసిడెంట్ చంద్రకళ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలికారు.

ముస్లిం మత నాయకుడు ఏహషాన్ ఖాన్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లింల ఐక్యతే భారతదేశానికి బలమని అన్నారు. 'రంజాన్' పర్వదినం సందర్భంగా దేవుడు అందరికీ శుభాలు కలిగిస్తాడని అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ పవిత్ర ఖురాన్‌ను పఠించగా, అతిథులు అనుసరించారు. ఆ తర్వాత సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇతర మాతాలకు చెందిన పలువురు అమెరికన్ సోదరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఛావా మాట్లాడుతూ.. భారత సంస్కృతీ, సాంప్రదాయాలను పండగలు పెంపొందిస్తాయని అన్నారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని చెప్పారు. హిందూ, ముస్లింలు కలిసి ప్రపంచ శాంతికి పాటుపడాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా హిందూ, ముస్లింలు కలిసి మెలసి సహజీవనం చేస్తున్నారని గుర్తు చేశారు.

బే ఏరియా మత పెద్ద ఏహషాన్ సయ్యద్ మాట్లాడుతూ. హైదరాబాద్‌లో లాగానే ఇక్కడ కూడా తమ పండగలు అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. పండగలతోనే మత సంబంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

తెలంగాణ-అమెరికన్ అసోసియేషన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నారై ప్రతినిధి జయరాం కోమటిని శాలువా, పూలగుచ్ఛంతో సత్కరించారు. ప్రతీ ఏడాది ఇదే విధంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

అమెరికా కాంగ్రెస్(సీఏ-డిస్ట్రిక్ట్ 17) అభ్యర్థి రావు ఖన్నా, కూపర్టినో నగర వైస్ మేయర్ సవితా వైద్యనాథన్, మిల్పిటాస్ నగర మేయర్ జోస్ ఈస్టేవ్స్, ఎన్పీయూ ప్రెసిడెంట్ పీటర్ సే, అజయ్ భూటోరియా, మొహమ్మద్ నదీమ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖన్నా మాట్లాడుతూ.. ఒకవేళ తాను ఎన్నికైతే వాషింగ్టన్‌లో కమ్యూనిటీకి బలంగా నిలుస్తానని చెప్పారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల అబ్దుల్ ఖద్దూస్ ముల్లా, ఇషాక్ సయ్యద్‌లు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమాకాంత్, వినయ్, జితేందర్ ఇఫ్తార్ విందు కోసం బిర్యానీజ్ రెస్టారెంట్ నుంచి సహకారం అందించారు. ఈ సందర్భంగా బిర్యానీజ్ రెస్టారెంట్ యజమాని ఉమాకాంత్‌కి టిసిఏ కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు టిసిఏను అతిథులందరూ అభినందించారు.

టిసిఏ కార్యనిర్వాహక సభ్యులు ఇక్బాల్ గట్టు, భాస్కర్ మద్ది, చంద్రకళ సిరామదాస్, ధనుంజయ రెడ్డి బోడ, వినయ్ మారెడ్డి, మాధవి రెడ్డి, మహిపాల్ రెడ్డి అన్నం, అభిలాస్ రంగినేని, కృష్ణ గండ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, అర్షద్ ఖాజా హుస్సేన్, ఉదయ్ జొన్నల, బుచ్చన్న గాజుల, బిక్షం పాలబందెల మద్దతుగా నిలిచారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

సిలీవ్యాన్ బే ఏరియాలో రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకుని తొలిసారి ‘దవాత్ ఈ-ఇఫ్తార్'కార్యక్రమాన్ని జూన్ 29న ఘనంగా నిర్వహించారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

సన్నీవేల్ ప్రాంతంలోని బిర్యానీజ్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 500మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

తెలంగాణ కల్చరల్ అసోసియేషన్(టిసిఏ), బిర్యానీజ్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

తాము చేపట్టిన తొలి ఇఫ్తార్ విందు కార్యక్రామానికి టిసిఏ ఫౌండింగ్ ఛైర్మన్ విజయ్ ఛావా, టిసిఏ ఛైర్మన్ భాస్కర్, టిసిఏ ప్రెసిడెంట్ చంద్రకళ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు స్వాగతం పలికారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

ముస్లిం మత నాయకుడు ఏహషాన్ ఖాన్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లింల ఐక్యతే భారతదేశానికి బలమని అన్నారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

‘రంజాన్' పర్వదినం సందర్భంగా దేవుడు అందరికీ శుభాలు కలిగిస్తాడని అన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ పవిత్ర ఖురాన్‌ను పఠించగా, అతిథులు అనుసరించారు. ఆ తర్వాత సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

ఈ కార్యక్రమంలో ఇతర మాతాలకు చెందిన పలువురు అమెరికన్ సోదరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఛావా మాట్లాడుతూ.. భారత సంస్కృతీ, సాంప్రదాయాలను పండగలు పెంపొందిస్తాయని అన్నారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని చెప్పారు. హిందూ, ముస్లింలు కలిసి ప్రపంచ శాంతికి పాటుపడాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా హిందూ, ముస్లింలు కలిసి మెలసి సహజీవనం చేస్తున్నారని గుర్తు చేశారు.

ఇఫ్తార్ విందు

ఇఫ్తార్ విందు

బే ఏరియా మత పెద్ద ఏహషాన్ సయ్యద్ మాట్లాడుతూ. హైదరాబాద్‌లో లాగానే ఇక్కడ కూడా పండగలు అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+