లండన్ వీధుల్లో హైదరాబాదీల గణేశుడి ఊరేగింపు
లండన్: లండన్‌లోని హైదరబాద్ ఫ్రెండ్స్ యూత్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం కార్యక్రమం జరిగింది. భారీ ఎత్తున లండన్ హొఉన్స్లొవ్ వీధుల్లో భజనలు, అటపాటలతో కార్యక్రమం సాగింది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పాల్గొని, ఆటపాటలతో సంబరాలు చేశారు.
గణపతి బప్పా మోరియా భారత్మాతాకి జై అనే నినాదాలతో లండన్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటిష్ వాళ్లు సైతం వచ్చిఈ వేడుకల్లల్లో పాల్గొనడం విశేషం. సంస్థ అద్యక్షులు దూసరి అశోక్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ ఒక్క కాస్మో పాలిటన్ నగరమని, వివిధ ప్రాంతాలు మతాల ప్రజలు కలిసి మెలిసిఉంటారని, అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుపుకొనిఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన అన్నిసంస్థలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు సీకా చంద్రశేఖర్, ఉపాధ్యక్షురాలు పవిత్ర రెడ్డి, సలహాదారు ఉదయ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈవెంట్ నిర్వాహకులు గోలి తిరుపతి, కవిత, కాసర్ల నాగేష్ రెడ్డి, జ్యోతి, వంశీ, దీప్తి, శశిధర్, సుమన్ గోలి, మల్లారెడ్డి, శుష్మ, శ్రవణ్ రెడ్డి, సుధాకర్, శౌరి, జితేందర్, సతీష్, మోహన్, సందీప్ గౌడ్, ఎల్లేందర్, మధు, సత్యం, సంగిరెడ్డిగుప్త కాసం, వెంకట్ రెడ్డి, విష్ణు, ఓం ప్రకాష్, కిషోర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications