NRI news:విధ్వంసకర పాలన నుంచి ఏపీకి విముక్తి - మినీ మహానాడులో గ్రీష్మ

జర్మనీ: జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ....ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారన్నారు.ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు మీ ఉద్యోగాలు,కుటుంబాల్ని వదలి రాష్ట్రంలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేసిన తీరు అభినంధనీయమని కొనియాడారు. నియంత జగన్ రెడ్డి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసిన యోధుడు నారా చంద్రబాబు నాయుడని చెప్పారు.

ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్‌ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి అధ్భుత, అసాధరణ విజయాన్ని మనకు అందించిన ఘనత చంద్రబాబుదని గ్రీష్మ చెప్పుకొచ్చారు. అభివృద్ధి,సంక్షేమం రెండూ జరగాలని ఆయన కోరుకుంటారని ఆ విధంగా ఏపీని తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చంద్రబాబు తీసుకుంటారని అన్నారు.కేవలం రాష్ట్రాభివృద్ధి చెందితే సరిపోదని దేశం కూడా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తారని వెల్లడించారు.

Germany AP got freedom from Jagans destructive rule says TDP leader Greeshma at Mini Mahanadu

2014లో ఒకవైపు విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించిన దార్శనికుడు చంద్రబాబని చెప్పిన గ్రీష్మ... 2019 లో తెలుగు ప్రజలు చేసిన ఒక్క తప్పిదానికి ఐదేళ్లు అంధకారంలో ఏపీ మగ్గిపోయిందని విమర్శించారు. నవరత్నాల పేరుతో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లో ఇష్టారాజ్యంగా జగన్ రెడ్డి ప్రభత్వం దోచుకుందని ఘటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ మహిళా నేత... రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారని దుయ్యబట్టారు.

సంక్షేమ పథకాలను అందించకుండానే అందినట్లు చూపించి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన ఘనత జగన్ రెడ్డిదని చెప్పిన గ్రీష్మ...అరాచక ప్రభుత్వాన్ని భరించలేని ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వానికి చావు దెబ్బ కొట్టారన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. 11 సీట్ల నుంచి తిరిగి పుంజుకోవడానికి జగన్ రెడ్డి ఏమి చంద్రబాబు కాదని ఎద్దేవా చేశారు.2019లో 175కి కేవలం 23 సీట్లు నెగ్గామని ఇక టీడీపీ పని అయిపోయిందని ఎవరెవరో విశ్లేషణలు ఇచ్చారని గుర్తు చేశారు గ్రీష్మ. కానీ గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జనలా 164 గెలిచి అఖండ విజయాన్ని సాధించామని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ విజయంలో టీడీపీ ఎన్‌ఆర్ఐ విభాగం కూడా కీలకపాత్ర పోషించడం హర్షణీయమని ఈ విజయం అందరిదని అభివర్ణించారు.జగన్ ప్రభుత్వంలా హింసా, విద్వేష రాజకీయాలు, పగలు, ప్రతీకారాలు తీర్చుకునే నీఛ ప్రభుత్వం తమది కాదని చెప్పిన గ్రీష్మ... అటువంటి వాటిని చంద్రబాబు ప్రోత్సహించరని గుర్తుచేశారు. దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబుకు ముఖ్యమని రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వామ్యులం కావాలని గ్రీష్మ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ కోర్ కమిటీ సభ్యులు కుర్ర పవన్, బత్తల శివ, కొర్రపాటి సుమంత్, దాసరి వంశీ, మద్దిపట్ల తిట్టు, కోనేరు నరేష్, కుడితిపూడి శ్రీకాంత్, కండ్ర వెంకట్, మిక్కిలినేని అనిల్ తదిరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+