అమెరికాలో సంగీత కోర్సులకు ఆదరణ(పిక్చర్స్)
డల్లాస్: అమెరికాలోని తెలుగు చిన్నారులు, యువతకు శాస్త్రీయ సంగీతాన్ని అందించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా గత శనివారం డల్లాస్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.
అక్టోబర్ 19న తానా పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సౌత్‌వెస్ట్ రీజియన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, సంగీత అధ్యాపకులు మీనాక్షి అనిపిండిలు అధికారికంగా తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంగీత కోర్సును ఫ్రిస్కోలోని శ్రీ షిర్డీసాయి సన్నిధిలో ప్రారంభించారు. ఈ కోర్సుకు అమెరికాలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలతోపాటు భాషను భావితరాలకు అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని, తానా చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి అని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అన్నారు.
ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షుడు, తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత కోర్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. సంగీతం నేర్చుకోవాలని కోరుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పారు. ఇక్కడ కర్ణాటక సంగీతం నేర్చుకున్న వారికి భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రెండేళ్ల ఈ సంగీత కోర్సు అనంతరం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తారని తెలిపారు.
అమెరికాలో అందిస్తున్న ఈ సంగీత కోర్సుకు కో ఆర్డినేటర్‌గా సంగీత అధ్యాపకురాలు మీనాక్షి అనిపిండి వ్యవహరిస్తారని, అమెరికాలోని అన్ని ప్రముఖ నగరాల్లో ఈ కోర్సును అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కోర్సుకు సంబంధించిన ఇతర వివరాల కోసం www.TANA.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని రాజేష్ అడుసుమిల్లి కోరారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీనాక్షి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పలు అన్నమాచార్య గీతాలను సుస్వర అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వారు ఆలపించారు. ప్రముఖ సంగీత కళాకారులు పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం, సీతా జయంత్ అన్నమాచార్య గీతాలను వినిపించారు. సుస్వర అకాడమీ విద్యార్థి హరీష్ యార్లగడ్డ పలు గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తానా సభ్యులు శ్రీకాంత్ పోలవరపు, చాల కొండ్రకుంట, కమ్యూనిటీ ప్రముఖులు సిఆర్ రావు, డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వెంకట్ ములుకుంట్ల, నసీమ్ షేక్, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తానా
అమెరికాలోని తెలుగు చిన్నారులు, యువతకు శాస్త్రీయ సంగీతాన్ని అందించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా గత శనివారం డల్లాస్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తానా
అక్టోబర్ 19న తానా పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సౌత్‌వెస్ట్ రీజియన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, సంగీత అధ్యాపకులు మీనాక్షి అనిపిండిలు అధికారికంగా తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంగీత కోర్సును ఫ్రిస్కోలోని శ్రీ షిర్డీసాయి సన్నిధిలో ప్రారంభించారు.

తానా
ఈ కోర్సుకు అమెరికాలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

తానా
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలతోపాటు భాషను భావితరాలకు అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని, తానా చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి అని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అన్నారు.

తానా
ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షుడు, తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత కోర్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. సంగీతం నేర్చుకోవాలని కోరుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications