రెండో స్థానం మనదే: 46వేల మందికి అమెరికా శాశ్వత పౌరసత్వం
Recommended Video

ముంబై: అమెరికాలో రెండో అతిపెద్ద కమ్యూనిటీగా భారతీయులు రికార్డుల్లోకి ఎక్కారు. తాజాగా, దాదాపు 46,100 మంది భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించడమే ఇందుకు కారణం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఈ మేరకు శాశ్వత సభ్యత్వం వివరాలను వెల్లడించింది.
అక్టోబర్ 1, 2015 నుంచి సెప్టెంబర్ 30, 2016 వరకు అమెరికా ప్రభుత్వం మొత్తం 7.53లక్షల మంది వ్యక్తులకు యూఎస్ పౌరసత్వాన్ని ఇచ్చింది. వారిలో ఆరుశాతం భారతీయులు ఉన్నారు.

రెండో స్థానం మనదే
అత్యధిక సంఖ్యలో యూఎస్ పౌరసత్వాన్ని అందుకున్న వారిలో మెక్సికన్లు ఉండటం గమనార్హం. వీరి తర్వాత భారతీయులే ఉండటం గమనార్హం. అయితే, మెక్సికో నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చే సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతోంది.

గత ఏడాది పెరిగిన దరఖాస్తులు
2015తో పోల్చుకుంటే గత సంవత్సరం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 24శాతం పెరిగినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. 2015లో శాశ్వత పౌరసత్వం కోసం 7.83లక్షల దరఖాస్తులు రాగా, 2016లో 9.72లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.

ప్రత్యేక హక్కులు
సాధారణంగా గ్రీన్ కార్డు ఉన్న వారికి మాత్రమే యూఎస్ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల అమెరికాలో సుదీర్ఘకాలంపాటు నివాసం ఉండవచ్చు. కాగా, పౌరసత్వం లభించని వారికి కొన్ని హక్కులను కల్పించడం జరుగుతుంది. అక్కడి ఎన్నికల్లో ఓటు వేసే హక్కుతోపాటు ఉద్యోగ అవకాశాల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఏసియన్ అమెరికన్ అడ్వాన్సింగ్ జస్టిస్ అధ్యక్షుడు జాన్ సి యాంగ్ తెలిపారు.

భారీగా పెరిగిన పెండింగ్ దరఖాస్తులు
న్యూ అమెరికన్ జాతీయ విభాగం నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 77శాతం పెరిగాయి. 2017 జూన్ చివరి నాటికి 7.08లక్షల దరఖాస్తులు పౌరసత్వం కోసం వేచివుండటం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీసా, విదేశీ విధానాలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ జాబితా పెరిగినట్లు తెలుస్తోంది.
-
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!











Click it and Unblock the Notifications