భారతీయులను బలంగా దెబ్బ కొట్టిన ట్రంప్: జన్మతః పౌరసత్వ హక్కు రద్దు: 150 ఏళ్లుగా
Donald Trump on Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.
తిరుగులేని మెజారిటీ..
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 2017లోనూ ఆయన ఆ దేశాధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. 2016 నాటి ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ తిరుగులేని మెజారిటీతో అందలం ఎక్కారు.

ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలు..
ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే కేపిటల్ హిల్స్ ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలను స్వీకరించారు. అడ్మినిస్ట్రేషన్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నాలకు దిగారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో, ఆ తరువాత ఇచ్చిన పలు ప్రసంగాల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన ఆర్డర్లు అవి.
నాన్ అమెరికన్లందరికీ బిగ్ షాక్..
ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్- భారతీయులతో పాటు నాన్ అమెరికన్లందరికీ బిగ్ షాక్‌కు గురి చేసేదే. జన్మతః పౌరసత్వ హక్కును డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం సైతం చేశారు. తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలోనే దీన్ని పొందుపరిచారంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ (జన్మతః నాన్ అమెరికన్లకు లభించే పౌరసత్వం)పై ఆయన ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు.
ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే విధానం..
నాన్ అమెరికన్లకు ఆ దేశ గడ్డపై పుట్టిన బిడ్డలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించే విధానం ఇప్పటిది కాదు. 150 సంవత్సరాలుగా ఇది అమల్లో ఉంటూ వస్తోంది. 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. తమ దేశ గడ్డపై జన్మించే ప్రతి పిల్లలకూ జన్మతః పౌరసత్వం లభిస్తుందని ప్రకటించింది.
అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద..
దీన్ని రద్దు చేస్తానంటూ గతంలోనూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నాటి మాటలను చేతల్లో చూపారు. నాన్ అమెరికన్లకు అప్పుడే పుట్టిన పిల్లలకు పౌరసత్వ హక్కును రద్దు చేశారు. అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారాయన.
జన్మతః పౌరసత్వ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే..
నాన్ అమెరికన్లకు పుట్టిన పిల్లలకు జన్మతః పౌరసత్వ హక్కు ఎప్పుడు లభిస్తుందంటే- ఒకటి తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉండాలి. రెండు- చట్టబద్ధమైన శాశ్వత చిరునామా ఉండాలి. మూడు- అమెరికా మిలటరీలో సభ్యుడైనా అయి ఉండాలి. దీన్ని అమలు చేయడంలో రాజ్యాంగబద్ధమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
భారతీయ తల్లిదండ్రులకు
ప్రస్తుతం భారతీయ తల్లిదండ్రులకు అమెరికా జన్మించిన పిల్లలు.. హెచ్1బీ వీసాలు, గ్రీన్ కార్డులు లేదా ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా అమెరికా పౌరసత్వాన్ని పొందుతారు. కొత్త నిబంధనల ప్రకారం- తల్లిదండ్రుల్లో ఒకరికి అమెరికా పౌరసత్వం ఉండాలి లేదా శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాంటి దంపతులకు జన్మించిన పిల్లలు మాత్రమే పౌరసత్వం పొందుతారు.












Click it and Unblock the Notifications