తుఫాను బాధితుల కోసం తానా నిధులు(పిక్చర్స్)
న్యూయార్క్: హుధుద్ తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రాంతీయ ప్రతినిధి(పశ్చిమ) భక్త బల్ల ఆధ్వర్యంలో బే ఏరియా, మిల్పిటస్‌లో నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. సుమారు 150 మందికి పైగా తెలుగు, కన్నడ, తమిళ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఒక్క రోజులోనే రూ. 16లక్షలు(26,000డాలర్లు) విరాళంగా సేకరించారు. వీటిని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తుఫాను రిలీఫ్ ఫండ్‌కి అందించనున్నట్లు తెలిపారు. తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం ఎన్నారై టిడిపి ద్వారా 30వేల డాలర్లు సేకరించి తానాకి అందించినందుకు భక్త బల్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అనుకోని ప్రమదాలు వచ్చినప్పుడు తెలుగువారిని ఆదుకోవడం ముందుంటున్న తానాను సభకు హాజరైన వారందరూ హర్షద్వానాలతో అభినందించారు. తుఫాను బాధితులకు సహాయమందించిన ప్రతీ ఒక్కరికీ భక్త బల్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ హనుమిరెడ్డి, తానా మ్యాచింగ్ గ్రాంట్స్(చైర్) మురళీ గొడవర్తి, చంద్ర గుంటుపల్లి, రామకృష్ణ, శ్రీధర చావా, శ్రీకర్ రెడ్డి, ఓం ప్రసాద్, శ్రీకాంత్, శ్రీనివాస్ కొమ్మినేని, జయరాం వెలగపూడి, నాగేశ్వరరావు వెనిగళ్ల, మనోజ్ లకినన, ప్రదీప్ చిక్కు, రామన్ చంచుల, రవి ఉప్పల, శ్రీధర్ పసల, శ్రీనివాస్ కనకాల, శ్రీనివాస్ వేముల, సూరి మంతెన, వెంకయ్య చౌదరి, విద్యసాగర్, సురేష్ ఉయ్యూరు, శ్రీనివాస్ వేజెండ్ల, ధీరజ్ నల్లగడ్ల, కళ్యాణ్ పళ్ల, తిరుపతి, శేషు, శ్రీరంగ, రమేష్ పాలేరు, మధు, లక్ష్మణ్ పరుచూరి, వీరు, అమిత్ షా, తదితరులు పాల్గొన్నారు.

తానా
హుధుద్ తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రాంతీయ ప్రతినిధి(పశ్చిమ) భక్త బల్ల ఆధ్వర్యంలో బే ఏరియా, మిల్పిటస్‌లో నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.

తానా
సుమారు 150 మందికి పైగా తెలుగు, కన్నడ, తమిళ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తానా
ఈ సందర్భంగా ఒక్క రోజులోనే రూ. 16లక్షలు(26,000డాలర్లు) విరాళంగా సేకరించారు. వీటిని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తుఫాను రిలీఫ్ ఫండ్‌కి అందించనున్నట్లు తెలిపారు.

తానా
తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం ఎన్నారై టిడిపి ద్వారా 30వేల డాలర్లు సేకరించి తానాకి అందించినందుకు భక్త బల్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications