అమెరికాలో మరో దారుణం: హైదరాబాదీని వెంబడించి దాడి, తీవ్రగాయాలు (వీడియో)
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన దుండగుల దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా, మరోసారి భారతీయుడిపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థిపై దుండగులు దాడి చేశారు. అతని సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో చోటు చేసుకుంది.
Hyderabad student was attacked and robbed in Chicago.
— Sudhakar Udumula (@sudhakarudumula) February 6, 2024
Syed Mazahir Ali, a student from #Hyderabad studying at Indiana Wesleyan University in Chicago, was seriously injured in an armed robbery near his home. pic.twitter.com/t3ycvlrqG9
హైదరాబాద్ లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అమెరికాలోని ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని అతని ఇంటి సమీపంలో ముగ్గురు దుండగులు వెంబడించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు బాధితుడు సయ్యద్ వాపోయాడు. అతని నుదురు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఫుడ్ ప్యాకెట్లు ఇంటికి తీసుకువస్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు దాడి చేశారని సయ్యద్ తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలియడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Why are #Indian #students being #attacked in #America ? @DcWalaDesi @shrit https://t.co/0hcyzMf3tj
— @NetizenHind (@netizenhind) February 6, 2024
కాగా, గతవారం ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి బెనిగర్ అనే విద్యార్థి శవమై కనిపించాడు. అతనికి అమెరికన్ పాస్ పోర్ట్ కూడా ఉంది. అదే వారం పర్ధ్యూ యూనివర్సిటీలో నీల్ ఆచార్య అనే విద్యార్థి కూడా మరణించాడు. మరోవైపు, హర్యానాకు చెందిన వివేక్ సైనీ అనే యువకుడు జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో దుండగుడి చేతిలో హత్యకు గురయ్యాడు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications