తొలిసారి: అమెరికా లా స్కూల్ డీన్‌గా సుజిత్ చౌదరి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రాజ్యాంగ, న్యాయశాస్త్రంలో నిపుణుడైన సుజిత్ చౌదరి అమెరికాలోని కాలిఫోరియా యూనివర్సిటీ(బెర్కిలీ)లోని స్కూల్ ఆఫ్ లా డీన్‌గా నియమితులయ్యారు. తొలిసారి ఈ అత్యున్నత బాధ్యతలు చేపట్టిన భారతీయుడిగా రికార్డు సృష్టించారు.
ఆయన ప్రస్తుతం న్కూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ నూతన పదవీ బాధ్యతలను సుజిత్ చౌదరి జులై 1న స్వీకరించిన ఆయన, ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ చాన్స్‌లర్ క్లౌడే స్టీలే ఇటీవల ఓ ప్రకటనలో చెప్పిన విషయం తెలిసిందే.

బెర్కిలీ న్యాయ విశ్వవిద్యాలయం అమెరికాలోని అత్యుత్తమ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోనే ఉత్తమ పరిశోధన కేంద్రం. సుజిత్ చౌదరి న్యాయశాస్త్రంపై పలు పుస్తకాలు రచించారు. 70కిపైగా ఆర్టికల్స్ ప్రచురించారు.
తొలుత న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ డీన్‌గా చేరిన చౌదరి ఆ తరువాత టొరంటో విశ్వవిద్యాలయంలోని లా స్కూల్‌లోని ప్రొఫెసర్ అయ్యారు. సుజిత్ చౌదరి ఢిల్లీలో జన్మించారు. ఇప్పటికే అమెరికాలోని పలు ఉన్నత విద్యా సంస్థల్లో భారతీయులు ఉన్నత స్థానాల్లో ఉండగా.. సుజిత్ ఈ ఉన్నత పదవిని చేపట్టడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications