లండన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు(పిక్చర్స్)

లండన్: ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లోని భారత హైకమిషన్, భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన 69వస్వాతంత్ర్య వేడుకల్లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టిఈఎన్ఎఫ్) తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. భారత హైకమిషనర్ రంజన్ మతై ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జాతీయగీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుండి సుమారు 30వేల మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధరాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావనతో తెలంగాణాఎన్నారై ఫోరమ్ (TeNF) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సంవత్సర కాలంలోని విజయాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ స్టాల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.

భారత హైకమిషనర్ రంజన్ మతై, భారత సంతతికి చెందినబ్రిటిష్ పార్లిమెంట్ సభ్యులు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, ఇతర ప్రతినిధుల బృందం తెలంగాణా స్టాల్‌ని సందర్శించారు. తెలంగాణ సంస్కృతి-సాంప్రదాయాలు, ప్రభుత్వ పథకాలు, నాయకత్వ విజయాలు, పర్యాటక ప్రత్యేకత, తెలంగాణా తల్లి ప్రతిమ, ప్రముఖుల పరిచయంతో కూడినసమగ్ర సమాచారం, ప్రదర్శన చాలా గొప్పగా ఉందని అన్నారు.

నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతనాన్ని, పెట్టుబడులకు అనుకూల పరిస్థితుల గురించి ప్రపంచానికి చూపెట్టాలనే ప్రయత్నం స్ఫూర్తిదాయకంగా ఉందని వారు ప్రశంసించారు. అలాగే గత సంవత్సరంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తున్నతీరు గమనిస్తున్నామని చెప్పారు. ఇంకా ఎన్నో ఆసక్తి గల విషయాలను తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

స్టాల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణ ప్రముఖుల చిత్ర పటాలకు నివాళులర్పించి, స్వాతంత్ర్య దినోత్స్వాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్‌ను భారత హైకమిషనర్ రంజన్ మతై కట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేయడం అభినందించారు.

మొట్ట మొదటిసారి తెలంగాణ జానపద నృత్యం ఇక్కడ జరిగిన సాంస్కృతిక వేదికపై ప్రదర్శించడం విశేషం. అతిథులందరూ సాంస్కృతిక కార్యక్రమాల్లో కేరింతలు కొడుతూ వారితోపాటు నృత్యాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి ముందుకు వచ్చి ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని నెహ్రూ సెంటర్ నిర్వాహకాలు అభినందించారు.

ఈ కార్యక్రమంలోవ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గంగాసాని, ఇవెంట్స్ ఇంఛార్జ్ నగేష్ రెడ్డి కాసర్ల, అడ్వైజరీ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు, సభ్యులు ప్రమోద్ అంతటి, కల్చరల్ సెక్రెటరీ శ్వేతారెడ్డి,
కోశాధికారి అశోక్ గౌడ్దూసరి, వెంకట్ రెడ్డి దొంతుల, మహిళా కో-ఆర్డినేటర్ సుమ దేవిరేకుల, స్పోర్ట్స్ ఇంఛార్జ్ నవీన్ రెడ్డి, రంగుల సుధాకర్, కల్చరల్ కో-ఆర్డినేటర్ మీనాక్షి అంతటి, నిర్మల, వాణి, స్వాతి, అపర్ణ, శౌరి, రత్నాకర్ కడుధుల, శ్రీకాంత్ జల్ల, సురేష్ బుడగం, రాజేష్ వర్మ, తెలంగాణ ఐటీ జాక్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కరీంనగర్ టిఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి కాసర్ల, రాజ్‌‌బజార్, తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లోని భారత హైకమిషన్, భారతదేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా జరిపిన 69వస్వాతంత్ర్య వేడుకల్లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టిఈఎన్ఎఫ్) తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

భారత హైకమిషనర్ రంజన్ మతై ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

అనంతరం జాతీయగీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. యూకే నలుమూలల నుండి సుమారు 30వేల మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధరాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావనతో తెలంగాణాఎన్నారై ఫోరమ్ (TeNF) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సంవత్సర కాలంలోని విజయాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ స్టాల్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

భారత హైకమిషనర్ రంజన్ మతై, భారత సంతతికి చెందినబ్రిటిష్ పార్లిమెంట్ సభ్యులు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, ఇతర ప్రతినిధుల బృందం తెలంగాణా స్టాల్‌ని సందర్శించారు.

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

తెలంగాణ సంస్కృతి-సాంప్రదాయాలు, ప్రభుత్వ పథకాలు, నాయకత్వ విజయాలు, పర్యాటక ప్రత్యేకత, తెలంగాణా తల్లి ప్రతిమ, ప్రముఖుల పరిచయంతో కూడినసమగ్ర
సమాచారం, ప్రదర్శన చాలా గొప్పగా ఉందని అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతనాన్ని, పెట్టుబడులకు అనుకూల పరిస్థితుల గురించి ప్రపంచానికి చూపెట్టాలనే ప్రయత్నం స్ఫూర్తిదాయకంగా ఉందని వారు ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+