NRI News: ఆ 8 మంది మరణశిక్షపై ఖతార్ కోర్టులో అప్పీలు చేసిన భారత్..
గత ఏడాది అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ భారత్ ఖతార్ కోర్టులో అప్పీలు చేసింది. భారత పిటిషన్ ను ఖాతర్ కోర్టు అంగీకరించింది. ఖతార్ కోర్టు ఈ భారతీయులకు అక్టోబర్ 26న మరణశిక్షను విధించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్పుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రభుత్వం అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోందని పేర్కొంది.
2022లో ఖతార్‌లోని అధికారులు డిఫెన్స్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది రిటైర్డ్ ఇండియన్ నేవీ సైనికులను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఆగస్టులో అక్కడి నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారంటూ వారిపై అభియోగాలు మోపినట్లు అక్కడి ప్రభుత్వ ఆధ్వరంలో నడిచే అల్-జజీరా పత్రిక పేర్కొంది.

కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లను దోహాలో అరెస్టు చేశారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అక్టోబర్‌లో ఎనిమిది మంది మాజీ నేవీ అధికారుల కుటుంబాలను కలిశారు. కుటుంబాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఖతార్ నుంచి ఎనిమిది మంది భారతీయులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తుందని మాజీ నేవీ అధికారుల బంధువులకు తెలిపారు. ఖతార్‌లోని భారత రాయబారి చివరిసారిగా అక్టోబరు 1న మాజీ నౌకాదళ సిబ్బందిని కలిశారు. 8 మందిని తిరిగి తీసుకురావడానికి భారత్ పయత్నాలు చేస్తోంది. పాక్‌లో చిక్కుకుపోయిన కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్ ఈ మార్గంలోనే ప్రయత్నం చేసింది. మన దేశ ఉన్నత నాయకత్వం ఖతార్ పాలకుడి వద్ద ఈ కేసును ప్రస్తావించి క్షమాభిక్ష ఇప్పించడం ప్రధానమైనదిగా పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications