మహిళలపై వేధింపులు: ఎన్నారై యువకుడిపై కేసు

బాలీవుడ్ సినిమాలతో ప్రభావితమైన నిందితుడు సందేశ్ బలిగ ఆ మహిళలను ప్రభావితం చేసేందుకు వారివెంట పడినట్లు కోర్టు ఎదుట అతడి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. మహిళల వెంట ఎప్పుడూ అంటిపెట్టుకుని తిరిగితే వారు ప్రేమలో పడతారనే నమ్మకంతోనే సందేశ్ బలిగ వారి వెంట పడ్టట్లు న్యాయవాది చెప్పారు.
సందేశ్ బాధిత మహిళలకు తరచూ ఫోన్ కాల్స్ చేయడంతో పాటు వారికి సందేశాలు పంపడం చేస్తుండే వాడని పోలీసులు తెలిపారు. ఒంటరిగా ఉన్న సమయంలో వారిని కలిసేందుకు వారి వెంటపడే వాడని చెప్పారు. అయితే బాధిత మహిళలు తమ వెంటపడొద్దని ఎంత చెప్పినా సందేశ్ వినకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
తమకు అతడు ప్రియుడిగా చెప్పుకుంటున్నారని పోలీసులకు బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, భారతదేశంలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన నిందితుడు, రెండు సంవత్సరాలకు గానూ టాస్మానియా వచ్చాడని సందేశ్ తరపు న్యాయవాది తెలిపారు. ఆస్ట్రేలియా చట్టాల పట్ల నిందితుడికి అవగాహన లేదని చెప్పారు. కాగా, ఈ కేసు విచారణను కోర్టు వచ్చే సెప్టెంబర్ నెలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications