లంచం: దోషిగా తేలిన ఇండియన్ సిఈఓకు 20ఏళ్ల జైలు
న్యూయార్క్: రెండు కంపెనీలకు సిఈఓగా వ్యవహరిస్తున్న ఇండియన్ అమెరికన్ లంచం ఇచ్చిన కేసులో దోషిగా తేలాడు. తన కంపెనీలకు సంబంధించిన స్టాక్స్‌ను కొనుగులో చేసేందుకు ఇతరులకు లంచం ఇచ్చినట్లు అభియోగాలు అతడిపై నమోదయ్యాయి.
కాలిఫోర్నియాకు చెందిన వ్యాపారవేత్త శైలేష్ షా(48) అమెరికా జిల్లా న్యాయమూర్తి రిచర్డ్ స్టీర్న్స్ ఎదుట తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మెయిల్, వైర్ మోసానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడు.

శైలేష్ షాకు వచ్చే అక్టోబర్‌లో న్యాయమూర్తి శిక్షను ఖరారు చేయనున్నారు. దాదాపు 20ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీంతోపాటు మూడేళ్లపాటు పోలీసుల పర్యవేక్షణలో ఉంచే అవకాశం ఉంది. అతడికి 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని ఎఫ్‌బిఐ ఓ ప్రకటనలో తెలిపింది.
శైలేష్ తన కంపెనీలో స్టాక్స్‌ను అక్రమంగా కొనుగోలు చేసేందుకు పలువురికి లంచాలు ఇచ్చి డీల్ కుదర్చుకున్నట్లు పేర్కొంది. ఇది చాలా మోసపూరిత వ్యవహారమని తెలిపింది. కాగా, పెట్టుబడిదారులుగా వచ్చిన ఎఫ్‌బిఐ ఏజెంట్లతో ఒప్పందం గురించి మాట్లాడి, శైలేష్ వారికి చిక్కాడు.












Click it and Unblock the Notifications