హేట్ క్రైమ్ కేసులో ఎన్నారై అరెస్ట్

ఈ కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణను చేపట్టారు. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రూక్‌లైన్‌లో నాకౌట గేమ్ గురించి మరో ముగ్గురితో మాట్లాడిన తర్వాత అమృత్ మారజ్.. యూదు మతానికి చెందిన యువకుడి(25)పై శుక్రవారం దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
మారజ్ తన నలుగురు స్నేహితులతో కలిసి స్థానిక బార్‌లో నాకౌట్ గేమ్‌పై చర్చించారు. ఆ తర్వాత అతని స్నేహితులు నాకౌట్ గేమ్‌పై పందెం కట్టడంతో మారజ్ అనాలోచితంగా బాధితునిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇలాంటి నాకౌట్ గేమ్‌ల పేరుతో న్యూయార్క్, న్యూహెవెన్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా లాంటి నగరాల్లో దాడులు జరుగుతున్నట్లు సమాచారం. గత నెలలో ఇలాంటి ఘటనలు ఆరు జరిగినట్లు న్యూహెవెన్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
శుక్రవారం జరిగిన దాడి కేసులో మారజ్‌తోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే వేధింపులకు పాల్పడింది మారజ్ మాత్రమేనని పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు మారజ్‌ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. వేధింపులు, హేట్ క్రైమ్ కేసుకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత నిందితునికి 750 అమెరికన్ డాలర్ల జరిమానాను విధించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications