వన్ సైడ్ లవ్, ఆత్మహత్యాయత్నం

 suicide
దుబాయ్: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట అక్టోబర్ 3న ఆత్మహత్యకు యత్నించిన ప్రవాస భారతీయుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట గురువారం నాడు బాలాజి భాస్కరన్ అనే యువకుడు చేయి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు అతన్ని మనమలోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు నిర్వహించిన చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. కాగా తను ప్రేమించిన మహిళ మరొకరితో వివాహం చేసుకోవడమే భాస్కరన్ ఆత్మహత్య యత్నానికి కారణమని తెలిసింది. ప్రస్తుతం బాలాజీ భాస్కరన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతను పనిచేస్తున్న కంపెనీ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటోందని భారత రాయబార కార్యాలయ అధికారి రాంసింగ్ తెలిపారు.

తను ప్రేమించిన యువతి దక్కకపోవడంతోనే భాస్కరన్ ఆత్మహత్యకు యత్నించాడని చెప్పారు. ఇంతకుముందు కూడా భాస్కరన్ ఆత్మహత్యకు యత్నించినట్లు రాంసింగ్ తెలిపారు.ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లేముందు అతనికి సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్ ఇప్పించనున్నట్లు ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+