Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విమానంలో భార్య పక్కనుండగానే యువతితో లైంగిక చర్య, ఐటీ మేనేజర్‌ను దోషిగా తేల్చిన డెట్రాయిట్ కోర్టు

వాషింగ్టన్‌: తన పక్కనే కట్టుకున్న భార్య ఉందన్న ఇంగితం కూడా లేకుండా పక్క సీట్లో కూర్చున్న ఓ యువతిని లైంగికంగా వేధించిన భారతీయుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఏడు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. డిసెంబరులో అతడికి శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.

భార్యతో కలిసి విమానం ఎక్కాడు..

భార్యతో కలిసి విమానం ఎక్కాడు..

రమణమూర్తి అమెరికాలోని రోచెస్టర్‌ హిల్స్‌ సిటీలో ఉంటూ ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేసేవాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్లే స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కాడు.

 భార్య పక్కనుండగానే యువతితో లైంగిక చర్య

భార్య పక్కనుండగానే యువతితో లైంగిక చర్య

రమణమూర్తికి ఓవైపు భార్య...మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారు. కొద్ది సేపటికి నిద్రలో జారుకున్న యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మేల్కొని అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 నా బటన్స్ విప్పేశాడంటూ బాధితురాలు

నా బటన్స్ విప్పేశాడంటూ బాధితురాలు

‘లేచి చూసేసరికి తన దుస్తుల బటన్స్ విప్పి ఉన్నాయి. రహస్య భాగాల వద్ద మూర్తి చేతులు తడుముతూ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను' అని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు.

చివరకు నేరం అంగీకరించిన రమణ

చివరకు నేరం అంగీకరించిన రమణ

కాగా, ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ రమణమూర్తి మొదట చెప్పుకొచ్చాడు. లోతుగా ప్రశ్నించేసరికి... చేయకూడనిది చేసి ఉంటానని నేరం అంగీకరించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ న్యాయస్థానం ఇటీవల అతడిని దోషిగా తేల్చింది. అతనికి వచ్చే డిసెంబర్‌లో శిక్షను ఖరారు చేయనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+