వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం ఇచ్చినందుకు భారతీయుడికి మూడేళ్ల జైలు

|
Google Oneindia TeluguNews

దుబాయ్: యుఏఈ డైరెక్టరేట్ ఆఫ్ నేచురలైజేషన్ అండ్ ఫారెన్ ఎఫైర్స్ శాఖ(జిడిఎన్ఎఫ్ఏ)లోని ఓ అధికారికి 10వేల దిర్హమ్స్ (2,722 డాలర్లు) లంచం ఇవ్వజూపినందుకు ప్రవాసభారతీయుడు జైలు పాలయ్యాడు. ఈ కేసును విచారించిన దుబాయ్ క్రిమినల్ కోర్టు అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

43ఏళ్ల ప్రవాసభారతీయుడికి మూడేళ్ల జైలు శిక్ష పడిందని అక్కడి కథనాలు పేర్కొన్నాయి. అతడి పేరును ఏఎన్ఎన్ తెలిపాయి. తన కుటుంబసభ్యుల వీసా కోసం యుఏఈ ఫారెన్ ఎఫైర్స్ అధికారికి 10వేల దిర్హమ్స్ అంటే మన రూపాయల్లో సుమారు రూ. 1.72 లక్షలు లంచం ఇవ్వజూపాడని వెల్లడించాయి.

ndian jailed in Dubai for graft

ఈ కేసులో నిందితుడికి మూడేళ్ల శిక్షి విధించిన కోర్టు.. శిక్ష కాలం ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. నిరుడు మే నెలలో జిడిఎన్ఎఫ్ఏ అధికారికి లంచం ఇవ్వజూపాడని అక్కడి మీడియా పేర్కొంది.

దీంతో ఆ అధికారి లంచం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. నిందితుడు చెప్పినట్లు విని, అతని నుంచి లంచం తీసుకోవాలని చెప్పారు. ఆ అధికారి కూడా అదే విధంగా చేశాడు. నిందితుడు లంచం ఇస్తుండగా ఉన్నతాధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా, బుధవారం ఈ కేసును విచారించిన కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

English summary
An Indian has been jailed here for three years for offering a Dh10,000 ($2,722) bribe to an employee of the UAE's Directorate General of Naturalisation and Foreigners Affairs (GDNFA) to clear his papers, a media report said Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X