లైంగిక వేధింపులు: ఎన్నారై అరెస్ట్

ఆల్జిరియాకు చెందిన ఓ మహిళ తన కూతురు(7)తోపాటు నిందితుడు పని చేస్తున్న ఆ రెస్టారెంటుకు (గత ఏడాది డిసెంబర్ నెలలో) భోజనం చేసేందుకు వెళ్లారు. భోజనం చేశాక బాధితురాలి తల్లి 50 దిర్హామ్‌లు నిందితుడు ఏఏకు ఇచ్చింది. అయితే అతడు తన దగ్గర చేంజ్ లేదని చెప్పాడు. దీంతో 40 దిర్హామ్‌ల చేంజ్ ఇస్తానని చెప్పి తన కూతురును అతని వెంట తీసుకెళ్లాడు నిందితుడు.
15 నిమిషాల తర్వాత ఏడ్చుకుంటూ తన దగ్గరకు తన కూతురు వచ్చిందని బాధితురాలి తల్లి తెలిపింది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. నిందితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన మెడపై ముద్దు పెట్టుకున్నాడని ఆ బాలిక తల్లికి తెలిపింది.
ఆ తర్వాత తన కూతురును తీసుకుని ఆ రెస్టారెంటుకు వెళ్లిన బాధితురాలి తల్లి నిందితునితో గొడవకు దిగింది. దీంతో అతడు భయంతో ఆందోళనకు గురయ్యాడు. తను చేసిన పనికి క్షమాపణ కోరుతున్నట్లు, తనను విడిచిపెట్టాలని బాధితురాలి తల్లిని కోరాలని నిందితుడు తన సహచరులకు విజ్ఞప్తి చేశాడు. అయితే బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications