NRI News: వైట్ హౌస్ పై దాడికి యత్నించిన భారత జాతీయుడు.. 8 ఏళ్ల జైలు శిక్ష..!

అద్దెకు తీసుకున్న ట్రక్కుతో వైట్ హౌస్‌పై దాడికి ప్రయత్నించినందుకు భారత జాతీయుడు సాయి వర్షిత్ కందుల (20) కు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. వర్షిత్ కందుల మే 22, 2023న అద్దెకు తీసుకున్న ట్రక్కులో వైట్‌హౌస్‌పై దాడికి ప్రయత్నించాడు. అతనికి శిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పు చెప్పింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అమెరికా ప్రభుత్వాన్ని కూలదోయడమే ఈ దాడి ఉద్దేశమని అమెరికా న్యాయ శాఖ తెలిపింది.

నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు యత్నించాడని పేర్కొంది. అతడి చర్యల వల్ల ధ్వంసమైన నిర్మాణాల తొలగింపు, పునర్నిర్మాణం మొదలైన ఖర్చులతో కలిపి నేషనల్ పార్క్ సర్వీస్‌కు USD 4,322 డాలర్ల (సుమారు రూ.3,74,000) నష్టం వాటిల్లిందని వివరించింది. అక్కడి మీడియా సంస్థల కథనాల ప్రకారం 2023 మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుంచి సాయి వర్షిత్‌ వాషింగ్టన్‌ డీసీకి వెళ్లాడు.

Indian national sentenced to 8 years in prison for attempting to attack White House

ఓ ట్రక్ అద్దెకు తీసుకుని అదే రోజు రాత్రి 9 గంటల 35 నిమిషాల సమయంలో వైట్‌హౌస్‌ వద్దకువెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని తీసుకెళ్లాడు. ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. భద్రత సిబ్బంది అతన్ని నిలవరించారు. అదుపులోకి తీసున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌ చంపాలనే ప్లాన్ తో దాడికి చేశాడని అధికారులు తెలిపారు. ఇందుకో చాలా రోజుల ముందు నుంచే ప్లాన్ వేసినట్లు పేర్కొన్నారు.

సాయి వర్షిత్ కందుల హైదరాబాద్ లోని చందానగర్‌లో జన్మించినట్లు తెలిసింది. అతడికి US గ్రీన్ కార్డ్‌ కూడా ఉంది. ఎనిమిదేళ్ల జైలు శిక్షతో పాటు, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి డాబ్నీ ఎల్. ఫ్రెడరిక్ కందులాను మూడు సంవత్సరాల పర్యవేక్షణలో విడుదల చేయాలని ఆదేశించారు. అంటే అతని విడుదల తర్వాత అతను నిరంతరం పర్యవేక్షణలో ఉండనున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+