హార్వర్డ్ కళాశాల డీన్‌గా భారతీయుడు

Harvard College
న్యూయార్క్: ప్రతిష్టాత్మక హార్వర్డ్ కళాశాల డీన్‌గా ప్రవాస భారతీయుడు రాకేష్ ఖురానా నియమించబడ్డారు. ఖురానా ఈ బాధ్యతలు జులైలో స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఖురానా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బిఎస్) లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ మెర్విన్ బోవర్ ప్రొఫెసర్‌గా, ఆర్ట్స్, సైన్స్ విభాగంలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా, కోబట్ హౌజ్‌లో కో-మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

అత్యంత అనుభవజ్ఞులైన ఖురానాను హార్వర్డ్ కళాశాలకు డీన్‌గా ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఎఫ్ఏఎస్) డీన్ మైకేల్ స్మిత్ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. ఖురానా సేవలను మరింతగా వినియోగించుకునేందుకే ఈ నియమాకం ఆయన చేపట్టినట్లు తెలిపారు. ఖురానా హార్వర్డ్ కళాశాల డీన్‌గా జులై 1న పదవీ బాధ్యతలు చేపడతారని చెప్పారు.

ప్రముఖ ప్రజ్ఞాశాలి, నాయకత్వ నేర్పుగల ఖురానాకు హార్వర్డ్‌తో ఎంతో కాలం నుంచి మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తున్న హార్వర్డ్ కళాశాలకు ఆయన మరింత ఖ్యాతిని తీసుకురాగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు. 1998లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి సంయుక్తంగా పిహెచ్‌డిని అందుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా హార్వర్డ్ డీన్ బాధ్యతల అప్పగించింది.

హార్వర్డ్ ప్రెసిడెంట్ డ్యూ ఫాస్ట్ మాట్లాడుతూ.. రాకేష్ ఖురానా హార్వర్డ్ ఫ్యాకల్టీ నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరని అన్నారు. హార్వర్డ్‌లో అతనొక అవార్డ్ విన్నింగ్ అధ్యాపకులని, గ్యాడ్యూయేట్ విద్యార్థిగా ఎంతో అనుభవముందని చెప్పారు. డీన్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఆయన సేవలు హార్వర్డ్ కళాశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. సరైన మార్గంలో కళాశాలను ఆయన నడిపించగలరని పేర్కొన్నారు. ఖురానా నియామకం పట్ల హార్వర్డ్ బిజినెస్ స్కూల్స్ డీన్ నితిన్ నెహ్రియా హర్షం వ్యక్తం చేశారు. ఖురానా డీన్ పదవిని సమర్థవంతంగా నిర్వహించగలరిన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+